News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ghost Release : దసరా బరిలో 'కన్నడ' శివన్న - 'ఘోస్ట్' విడుదల ఎప్పుడంటే?

Dussehra 2023 Movie Releases : కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్'. దసరా బరిలో ఈ సినిమా విడుదల అవుతోంది.

FOLLOW US: 
Share:

ప్రముఖ కన్నడ కథానాయకుడు శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) హీరోగా  నటించిన పాన్ ఇండియా యాక్షన్ సినిమా 'ఘోస్ట్' (Ghost Movie). దీనిని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. దసరా బరిలో ఈ సినిమా విడుదల కానుంది. 

అక్టోబర్ 19న 'ఘోస్ట్' విడుదల
Ghost Release Date : అక్టోబర్ 19న 'ఘోస్ట్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అంటే... విజయ దశమి సందర్భంగా ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట. కన్నడతో పాటు తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో దసరాకు థియేటర్లలో సినిమా సందడి చేయనుంది. 

విజయదశమికి బాలకృష్ణ 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు', తమిళ హీరో విజయ్ 'లియో' సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. 

అక్టోబర్ రెండో వారం నుంచి స్పెషల్ ప్రీమియర్స్!
అక్టోబర్ 19న సినిమా విడుదల అయితే... దానికి ఓ వారం ముందు నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేశారు. అక్టోబర్ రెండో వారం నుంచి ఇండియాలోని పలు నగరాల్లో షోలు వేస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు. 'ఘోస్ట్' చిత్రానికి కన్నడ హిట్ 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకుడు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 31వ సినిమాగా ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు.

Also Read : హారర్ థ్రిల్లర్ సినిమాతో రాజమౌళి హీరోయిన్ రీ ఎంట్రీ - లుక్ చూశారా?

శివ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'ఘోస్ట్' టీజర్ ఫ్యాన్స్, ప్రేక్షకులను ఆకట్టుకుంది. దట్టమైన చెట్ల మధ్య పాడుబడిన భవంతిలో హీరో ఒక్కడే ఉన్నాడని తెలుసుకున్న ఆఫ్రికన్ మాఫియా, అతడిని ప్రాణాలతో పట్టుకోవడానికి వస్తుంది. పది నిమిషాల్లో అతడిని పట్టుకుంటామని తమను పంపిన వ్యక్తికి ఆఫ్రికన్ ఒకరు చెబుతారు. 'మీ కంటే ముందు వెళ్లిన వాళ్ళు ఐదు నిమిషాల్లో పట్టుకుంటామని చెప్పారు. కానీ, ఇంకా తిరిగి రాలేదు' అని చెబుతారు. ఆ తర్వాత శివన్న ఎంట్రీ!

Also Read 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ రివ్యూ : పోలీస్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా హిట్టా? ఫట్టా?

ఇప్పటి వరకు హీరో హీరోయిన్లు పానీ పూరి తినడం మీరు చూసి ఉంటారు. 'ఘోస్ట్' సినిమాలో శివ రాజ్ కుమార్ స్టైల్ సెపరేట్! విస్కీలో పూరిని ముంచుకుని తిన్నారు. దర్శకుడు శ్రీని చాలా వెరైటీగా, అదే సమయంలో హీరోయిజం ఉండేలా చూసుకుని కొత్త డిజైన్ చేశారు. ''మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో... అంత కంటే ఎక్కువ మందిని నా కళ్ళతో భయపెట్టాను. They Call Me OG. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'' అని శివ రాజ్ కుమార్ చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్!  

అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న తదితరులు నటిస్తున్న 'ఘోస్ట్' చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ: చేతన్ డిసౌజా, వెంకట్ (హైదరాబాద్), అర్జున్ రాజ్, మాస్ మద, కూర్పు : దీపు ఎస్ కుమార్, ఛాయాగ్రహణం : మహేంద్ర సింహ, సంగీతం: అర్జున్ జన్య, సమర్పణ : ఎమ్మెల్సీ సందేశ్ నాగరాజ్, కథ - దర్శకత్వం: శ్రీని.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 26 Aug 2023 05:41 PM (IST) Tags: Shiva Rajkumar Pan India Action Movie Ghost Release Date Ghost On October 19 Dussehra 2023 Movie Releases

ఇవి కూడా చూడండి

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి

టాప్ స్టోరీస్

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు !  గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?

గణేష్‌ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం- నిమజ్జనానికి తరలివెళ్తున్న ఖైరతాబాద్‌ గణపతి

గణేష్‌ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం- నిమజ్జనానికి తరలివెళ్తున్న ఖైరతాబాద్‌ గణపతి

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు

మధ్యప్రదేశ్‌ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు