Shine Tom Chacko: ప్లీజ్... సాయం చేయాలంటూ రోడ్డుపైనే ఏడ్చేశా - యాక్సిడెంట్ ఘటనపై మలయాళ హీరో 'షైన్ చాకో 'ఎమోషనల్
Shine Chacko: ఇటీవల తన ఇంట జరిగిన విషాదంపై మలయాళ హీరో షైన్ టామ్ చాకో స్పందించారు. ఆ టైంలో తమకు సాయం చేయాలంటూ రోడ్డుపైనే ఏడ్చేసినట్లు చెప్పారు.

Shine Tom Chacko Emotional About His Accident Incident: మలయాళ హీరో, 'దసరా' ఫేం విలన్ షైన్ టామ్ చాకో ఇటీవల కారు యాక్సిడెంట్‌లో తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదంపై ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
సాయం కోసం రోడ్డుపైనే ఏడ్చేశా...
కళ్లు మూసి తెరిచే లోపే యాక్సిడెంట్ జరిగిపోయిందని... ఈ ఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు షైన్ చాకో. ఆ ప్రమాదంలో తన తండ్రిని కోల్పోవడంపై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఆ రోజు ఉదయం అమ్మ నాన్న, నేను, నా సోదరుడు కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నేను వెనుక సీటులో కూర్చుని నిద్రపోతున్నా. నాన్నతో మాట్లాడుతూనే పడుకున్నా. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచి చూసే సరికి మా కారుకు ప్రమాదం జరిగింది. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. మేమంతా రోడ్డుపైనే ఉన్నామనే విషయం కూడా మాకు తెలీలేదు.
అమ్మ షాక్‌తో ఏం జరిగింది? అని నన్ను ప్రశ్నించారు. మా నాన్నను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. ఎన్నోసార్లు పలు చోట్ల యాక్సిడెంట్స్ గురించి విన్నాను. చూశాను తప్ప ఫస్ట్ టైం ఇలాంటి భయానక అనుభవం ఎదుర్కొన్నా. 'దయచేసి ఎవరైనా సాయం చేయండి. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లండి' అంటూ రోడ్డుపైనే ఏడ్చేశా.' అని ఎమోషనల్ అయ్యారు.
Also Read: కింగ్ నాగార్జున హోస్ట్... బిగ్ బాస్ సీజన్ 9 - హౌస్‌లోకి మీరూ వెళ్లొచ్చు తెలుసా... ఎలాగంటే?
ఎక్కువ సేపు నిద్రలోనే...
ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? అనేది తనకు సరిగా గుర్తు లేదని షైన్ చాకో (Shine Tom Chacko) తెలిపారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా గత కొంతకాలంగా తాను చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. 'మెడిసిన్ వల్ల ఎక్కువ సేపు నిద్రలోనే ఉంటున్నా. యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా నేను ఆ మెడిసిన్ వాడాను. నిద్రలోనే ఉండడంతో ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియలేదు. యాక్సిడెంట్‌లో నాకు తీవ్ర గాయాలై దాదాపు 30 కుట్లు పడ్డాయి. నా తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. తండ్రి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం.' అని అన్నారు.
ఇటీవల షైన్ టామ్ చాకో ఫ్యామిలీతో కలిసి కారులో ఎర్నాకులం నుంచి బెంగుళూరు వెళ్తుండగా... ధర్మపురి జిల్లా పాలకొట్టై సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి సీపీ చాకో ప్రాణాలు కోల్పోయారు. చాకోతో పాటు ఆయన తల్లి, సోదరునికి గాయాలయ్యాయి.
మలయాళంలో హీరోగా మెప్పించిన షైన్ టామ్ చాకో నాని 'దసరా' మూవీలో విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రంగబలి, దేవర, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ మూవీస్‌లో నటించారు. ఆయన రీసెంట్ మూవీ 'సూత్ర వాక్యం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా... తెలుగులోనూ అలరించనుంది. ఎన్టీఆర్ 'దేవర' సీక్వెల్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.






















