Shipla Shetty Raj Kundra: స్వామీజీకి నేనున్నా - కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైన బాలీవుడ్ హీరోయిన్ భర్త
Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఓ స్వామీజీకి తన కిడ్నీని దానం చేస్తానని చెప్పడం వైరల్‌గా మారింది. ఈ వీడియోను సదరు స్వామీజీ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు.

Shilpa Shetty Husband Raj Kundra Offers Kidney To Swamiji: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. తనను రూ.60 కోట్ల మేర మోసం చేశారని ఆరోపిస్తూ ఓ బిజనెస్ మ్యాన్ వీరిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా... ఓ స్వామీజీకి తన కిడ్నీ దానం చేస్తానంటూ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు మధురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామీజీని దర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్వామీజీ... తాను కిడ్నీ సమస్యతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన రాజ్ కుంద్రా తన కిడ్నీ దానం చేస్తానని చెప్పారు. 'నేను గత రెండేళ్లుగా మీ ప్రవచనాలు వింటూ మిమ్మల్ని ఫాలో అవుతున్నా. మీరు అనారోగ్యంతో బాధ పడుతున్నారంటే నేను ఎలాంటి సందేహం లేకుండా ఓ మాట మాత్రం చెప్పగలను.
మీకు కిడ్నీ ఇచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మీకు నేను చేయగలిగిన సాయం ఇదొక్కటే.' అంటూ చెప్పారు. ఇది విన్న అక్కడి వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. రాజ్ కుంద్రా మాటలకు రియాక్ట్ అయిన స్వామీజీ ప్రేమానంద్... 'నీ మాటల వల్ల నీ మంచి మనసు అందరికీ అర్థమైంది. నీ మాటలు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. మనకు పిలుపు వచ్చే వరకూ ఈ లోకాన్ని విడిచి వెళ్లలేం.' అని అన్నారు. ఈ వీడియోను ప్రేమానంద్ తన భజన్ మార్గ్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
Also Read: కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్... బాక్సాఫీస్‌పై రజనీ దండయాత్ర - ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి... శిల్పాశెట్టి దంపతులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 2015 - 23 మధ్య జరిగిన వ్యాపార ఒప్పందం నిమిత్తం... తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి రూ.60.48 కోట్లు వారికి పెట్టుబడిగా ఇచ్చానని చెప్పారు. అయితే... ఆ డబ్బును తమ సొంత అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపించారు.
బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి వారు డైరెక్టర్లుగా ఉండే వారని ఆ టైంలో వారి మాటలు నమ్మి పెట్టుబడి పెట్టానని తెలిపారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. 2016 ఏప్రిల్‍లో తనకు శిల్పాశెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని... ఆ తర్వాత ఆమె డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారని చెప్పారు. ఆ కంపెనీ దివాలా తీసిందనే విషయం తనకు ఇటీవలే తెలిసిందని పోలీసులకు కంప్లైంట్ చేశారు.
ఆ ఆరోపణలు నిరాధారం
ఈ ఆరోపణలపై శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది స్పందించారు. ఈ కేసు నిరాధారమైనదని... సివిల్ అంశం కంపెనీ ఆర్థిక ఇబ్బందుల తర్వాత చట్టపరమైన విషయంగా మారిందన్నారు. తమ తరఫు నుంచి చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు.





















