Shazia Manzoor: ఇలాగేనా మాట్లాడేది? లైవ్ షోలో హోస్ట్ చెంప పగలగొట్టిన సింగర్, వీడియో వైరల్
Shazia Manzoor: ఒక షోలో పాల్గొనడానికి వచ్చిన సింగర్ షాజియా మన్జూర్‌పై ఆ షో కో హోస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో తనకు కోపం వచ్చి ఆ హోస్ట్ చెంప పగలగొట్టింది.
Shazia Manzoor Slaps Sherry Nanha: ఈరోజుల్లో బుల్లితెరపై కొందరు మాట్లాడే మాటలకు ఫిల్టర్స్ ఉండడం లేదు. కామెడీ షోలు అయితే మరీ శృతిమించిపోతున్నాయి అంటూ ఇప్పటికే ఎందరో ప్రేక్షకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు గెస్టులకు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడం, దాని నుండి టీఆర్‌పీలు పెంచుకోవడమే ఈ కామెడీ షోల ప్లాన్. అయితే తాజాగా తనను అభ్యంతరకరమైన ప్రశ్న అడిగినందుకు కో హోస్ట్ చెంప పగలగొట్టింది ఒక పాకిస్థానీ సింగర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇంకా చాలామంది హెస్ట్‌లకు కూడా ఇలాంటిది జరగాలని చర్చించుకుంటున్నారు.
ఆమె కోపానికి కారణం ఇదే
పాకిస్థానీ సింగర్ షాజియా మన్జూర్.. తాజాగా ఒక ప్రైవేట్ ఛానెల్‌లోని ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ‘పబ్లిక్ డిమాండ్’ అనే ఈ షోలో ఆమె ఇదివరకు కూడా పాల్గొన్నారు. కానీ ఈసారి షో కో హోస్ట్ అయిన షెర్రీ నన్హా ప్రవర్తనపై ఆమె మండిపడ్డారు. అంతే కాకుండా ఆయనపై చేయి కూడా చేసుకున్నారు. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే.. ‘‘షాజియా.. నేను నిన్ను హనీమూన్ కోసం మాంటే కార్లో తీసుకువెళ్లాలి అనుకుంటున్నాను. నువ్వు ఏ క్లాస్‌లో ప్రయాణించాలి అనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించాడు నన్హా. తను అడుగుతున్న ప్రశ్నలకు, తన ప్రవర్తనకు షాజియా ఇబ్బంది పడుతుందున్న విషయం స్పష్టంగా అర్థమయినా కూడా షెర్రీ నన్హా ఆపలేదు.
ఆడవారితో ఇలాగేనా మాట్లాడేది.?
‘‘పోయినసారి నేను షోకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఇలాగే ప్రవర్తించావు. దానికి నేను సీరియస్ అయ్యి.. ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పి వదిలేశాను. కానీ ఈసారి నేను నిజంగా సీరియస్‌గా ఉన్నాను. ఆడవారితో ఇలాగేనా మాట్లాడేది? హనీమూన్ అని పదాలు ఉపయోగిస్తున్నావేంటి’’ అంటూ ఒక్కసారిగా షెర్రీ నన్హాపై సీరియస్ అయ్యారు షాజియా. పరిస్థితి సీరియస్ అవుతుందని గమనించిన హోస్ట్ హైదర్.. మధ్యలో జోక్యం చేసుకున్నాడు. నన్హాను స్క్రిప్ట్‌లో ఉన్నది మాత్రమే చేయమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయంలో షాజియా షో నుండి లేచి వెళ్లిపోయి తిరిగి రానని చెప్పేశారు.
Slap kalesh b/w Pakistani Singer Shazia Manjoor and Co-Host of show over making joke on 'Honeymoon' with a Woman
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 27, 2024
pic.twitter.com/6fehVrq7NS
ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు..
అయితే బుల్లితెరపై జరిగే చాలా విషయాలు నిజమా కాదా అనేది క్లారిటీ ఉండదు. అందుకే ఇది కూడా నిజమా కాదా అని ప్రేక్షకులు సందేహపడుతున్నారు. అది కచ్చితంగా చివర్లో ప్రాంకే అవుతుంది అని మాట్లాడుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక షాజియా మన్జూర్‌కు పాకిస్థానీ మ్యూజిక్‌లో చాలా పాపులర్ సింగర్. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఆమె పాటలు పాడారు. అంతే కాకుండా ఆల్బమ్ సాంగ్స్‌కు కూడా ఆమె స్వరాన్ని అందించారు. ‘బటియాన్ బుఝే రఖ్ దీ’, ‘ఛాన్ మేరే మఖ్నా’, ‘బాల్లే బాల్లే’లాంటి పాటలతో షాజియా మంచి గుర్తింపు సాధించారు.
Also Read: సిగ్గులేకుండా ఆయన పేరు వాడుకుంటా - అమీర్ ఖాన్‌పై మాజీ భార్య కిరణ్ రావు కామెంట్స్