Sharwanand: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ లుక్ - ఒక్కసారిగా ఇలా మారిపోయాడేంటి?... నిజంగా గుర్తు పట్టలేమంతే...
Sharwanand New Look: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ లుక్ అదిరిపోయింది. కొత్త మూవీలో రేసర్‌గా కనిపించేందుకు ఆయన బాగా సన్నబడ్డారు. ప్రస్తుతం ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Sharwanand New Look For Biker Movie: మూవీస్ కోసం హీరోస్ సిక్స్ ప్యాక్ ఇంప్లిమెంట్ చేయడం, బరువు తగ్గడం, స్పెషల్ ఎక్సర్‌సైజులు వంటివి చేయడం చూస్తుంటాం. రోల్ డిమాండ్ చేస్తే కంప్లీట్‌గా ఆ లుక్‌లోకి గుర్తు పట్టలేనంతగా మారిపోతుంటారు. తాజాగా... ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ న్యూ లుక్ సైతం వైరల్ అవుతోంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సిక్స్ ప్యాక్ బాడీ కోసం సన్నగా మారారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈయన శర్వానందేనా అనుకుంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
యూత్ ట్రెండ్‌కు అనుగుణంగా...
ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేశారు. ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌తో మెప్పించిన శర్వా... తాజాగా యూత్ ట్రెండ్ మూవీలో నటిస్తున్నారు. ఇంతకు ముందు చేసిన సినిమాలకు భిన్నంగా స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నారు. దీపావళి సందర్భంగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో 'బైకర్' మూవీ తెరకెక్కనుండగా... టైటిల్‌కు తగ్గట్లుగానే బైక్‌పై యూత్ ఫుల్ స్టైలిష్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
View this post on Instagram
ఫోటోలు వైరల్
శర్వా లేటెస్ట్ ఫోటోలతో ఒక్కసారిగా 'టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ'గా మారారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా సన్నగా కనిపించారు. కొత్త మూవీలో ఆయన రేసర్‌గా కనిపించనుండగా... ఆ లుక్ కోసం బాగా బరువు తగ్గినట్లు కనిపిస్తోంది. దీని కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్, స్ట్రిక్ట్ ఆహారపు అలవాట్లు పాటించారట.
Also Read: ఊహకు అందదు... బాలయ్య డైలాగుకు రీ సౌండ్ గ్యారెంటీ - 'అఖండ 2' లేటెస్ట్ టీజర్ చూశారా?
మూవీలో శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ సమర్పణలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ శర్వా తండ్రిగా నటించనుండగా... బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 1990, 2000ల బ్యాక్ డ్రాప్‌లో సాగే కథతో రేసింగ్ ప్రధానాంశంగా మూవీ రూపొందుతోంది. ఇప్పటివరకూ ఈ బ్యానర్‌లో శర్వా చేసిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మూవీతో పాటే వరుస ప్రాజెక్టులతో శర్వా బిజీగా మారారు. 'సామజవరగమన' ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో 'నారీ నారీ నడుమ మురారి' వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. మూవీలో సాక్షి వైద్య, సంయుక్తం హీరోయిన్లుగా నటించనుండగా... కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. దీంతో పాటే సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' మూవీ చేస్తున్నారు. అలాగే, శ్రీను వైట్ల మూవీకి కూడా శర్వా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.





















