Sharwanand: 'సామజవరగమన' డైరెక్టర్‌తో శర్వానంద్ సినిమా - సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే?
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ 'సామజవరగమన' డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ పరంగా చాలా డౌన్ ఫాల్ లో ఉన్నాడు. శర్వానంద్ ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వరుసగా ప్లాప్స్ అవుతున్నాయి. 'మహానుభావుడు', 'శతమానంభవతి' సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ ని ఇప్పటివరకు అందుకోలేకపోయాడు. ఈ సినిమాల తర్వాత శర్వానంద్ నటించిన 'పడి పడి లేచే మనసు', 'రణరంగం', 'జాను', 'మహాసముద్రం', 'శ్రీకారం', 'ఆడాళ్లు మీకు జోహార్లు' వంటి సినిమాలన్నీ నిరాశనే మిగిల్చాయి. శర్వానంద్ గత ఏడాది నటించిన 'ఒకే ఒక జీవితం' పర్వాలేదనిపించింది. అయితే ఈసారి ఎలాగైనా భారీ కం బ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు ఈ యంగ్ హీరో.
ఈ క్రమంలోనే కాస్త ఆలస్యమైనా కూడా కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్లాపుల్లో ఉన్న శ్రీవిష్ణు కి '‘సామజవరగమన’' సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందించిన రామ్ అబ్బరాజు. రీసెంట్ టైమ్స్ లో ‘సామజవరగమన’ థియేటర్స్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. శ్రీవిష్ణు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆడియన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు.
ఈ మూవీ సక్సెస్ తో దర్శకుడిగా రామ్ అబ్బరాజుకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొనగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ అబ్బరాజు తన తదుపరి చిత్రాన్ని యంగ్ హీరో శర్వానంద్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ డైరెక్టర్ నాగచైతన్యతో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదని ఇప్పుడు ఆ కథ శర్వానంద్ దగ్గరికి వెళ్లిందని చెబుతున్నారు. ‘సామజవరగమన’ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న రామ్ అబ్బరాజు చెప్పిన కథ శర్వానంద్ కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనట్లు సమాచారం. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్న ఈ ప్రాజెక్టు అధికారిక ప్రకటన త్వరలోనే రానందని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటివరకు ప్లాప్స్ తో ఉన్న శ్రీవిష్ణు కి భారీ హిట్ అందించిన రామ్ అబ్బరాజు ఇప్పుడు వరుస ప్లాపుల్లో ఉన్న శర్వానంద్ కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తాడో చూడాలి. ఇక శర్వానంద్ విషయానికి వస్తే.. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో చేస్తున్న సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి 'మనమే' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే టైటిల్ ఫస్ట్ అండ్ టీజర్ ని విడుదల చేయనున్నారు.
Also Read : కమల్-మణిరత్నం మూవీలో హీరోయిన్ పారితోషికం ఫిక్స్, ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial