అన్వేషించండి

Shanto Khan: ఏకంగా హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపేసిన జనాలు - అసలు ఏం జరిగింది?

Shanto Khan Murder: బంగ్లాదేశీ ఇండస్ట్రీలో దారుణం జరిగింది. దర్శక నిర్మాత సెలీమ్ ఖాన్, తన కుమారుడు షాంతో ఖాన్‌ను దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా ప్రకటించారు.

Shanto Khan - Selim Khan: బంగ్లాదేశీ నటుడు షాంతో ఖాన్, తన తండ్రి, లక్ష్మిపూర్ మోడల్ యూనియన్ పరిషద్ చైర్మన్ సెలీమ్ ఖాన్ హత్య అక్కడి సినీ పరిశ్రమలో కలకలం సృష్టించాయి. షాంతో ఖాన్ ఇప్పుడిప్పుడే యంగ్ హీరోగా ఎదుగుతుండగా తన తండ్రి సెలీమ్ ఖాన్ కూడా పలు సినిమాలకు దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఫేస్‌బుక్‌లోని ‘బంగ్లా చలాచిత్రా’ అనే గ్రూప్ ద్వారా ఈ తండ్రీకొడుకుల హత్యల గురించి బయటికొచ్చింది. సోషల్ మీడియాలో, అక్కడి లోకల్ న్యూస్ ఛానెళ్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. షాంతో, తన తండ్రి సెలీమ్ ఖాన్ ఒక గుంపు దాడిలో మరణించారని తెలుస్తోంది.

మార్కెట్‌లో గొడవ..

ఫరక్కాబాద్ మార్కెట్‌లో జరుగుతున్న బాలియా యూనియన్ గొడవలో షాంతో ఖాన్, తన తండ్రి సెలీమ్ ఖాన్ జోక్యం చేసుకున్నారని సమాచారం. వారు తమ ఊరి నుంచి తప్పించుకొని పారిపోతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రీ కొడుకులిద్దరు బగారా మార్కెట్ దగ్గరకు చేరుకోగానే కొన్ని ఓ గుంపు దాడి చేసింది.  దీంతో వారిద్దరు  తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ గుంపుపై ఎదురుదాడికి దిగారు. కాసేపు వారిని వారు కాపాడుకోగలిగినా చివరికి ఆ గుంపు షాంతోను, సెలీమ్‌ను హత్య చేసిందని అక్కడి మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి.

పలు క్రిమినల్ కేసులు..

చందాపూర్ సదార్ మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ (ఓసీ) అయిన షేక్ మోహ్సీన్ అలామ్ కూడా మీడియాకు షాంతో, సెలీమ్ మరణాల గురించి అధికారికంగా ప్రకటించారు. వారిద్దరూ గుంపు దాడితో హత్యకు గురయ్యారని తెలిపారు. సెలీమ్ ఖాన్‌పై ఇంతకు ముందు కూడా పలు క్రిమినల్ కేసులు రెజిస్టర్ అయ్యాయి. చందాపూర్ బోర్డర్‌లో ఉన్న పద్మ - మేఘన చెరువు దగ్గర అనేక వాహనాలను నిలిపి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్టుగా గతంలో సెలీమ్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. దానివల్ల తను పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అంతే కాకుండా ఇప్పటికీ ఏసీసీలో తనకు వ్యతిరేకంగా కేసు నడుస్తోంది.

కుమారుడిని లాంచ్..

సెలీమ్ ఖాన్ స్వయంగా షప్లా మీడియా అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. దాని ద్వారా ‘షెహెన్షా’, ‘బిద్రోహి’ వంటి పలు హిట్ చిత్రాలను నిర్మించారు. బంగ్లాదేశీ స్టార్ హీరో అయిన షకీబ్ ఖాన్.. ఇందులో హీరోగా నటించారు. నిర్మాతగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సెలీమ్ ఖాన్. ‘తుంగి పరార్ మియా భాయ్’ వంటి మూవీని డైరెక్ట్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతోనే తన కుమారుడు షాంతోను హీరోగా పరిచయం చేశారు. షాంతో ఖాన్ వద్ద అక్రమాస్తులు ఉన్నాయంటూ తనపై కూడా ఏసీసీలో కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఈ తండ్రీకొడుకుల హత్య అక్కడి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: 'దసరా' మూవీ నటుడికి అరుదైన వ్యాధి - ADHDతో బాధపడుతున్న షైన్‌ టామ్‌ చాకో, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బుడమేరు గండ్లు పూడ్చివేత పూర్తి, లీకేజ్‌ తగ్గించేందుకు అధికారుల యత్నంవరద బాధితులకు చిన్నారుల సాయం, వీడియో పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబువినాయక నిమజ్జనం వేడుకల్లో అంబానీ ఫ్యామిలీముంబైలో సందీప్ రెడ్డి వంగాను కలిసిన జూనియర్ ఎన్టీఆర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ - రేవంత్ రెడ్డి ఆదేశాలు
VRO Beats Flood Victim: విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
విజయవాడలో వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో, చర్యలు తీసుకున్న ప్రభుత్వం
Duleep Trophy 2024: 'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
'అనంత'కు చేరుకున్న ఇండియా ఏ, ఇండియా బీ ఆటగాళ్లకు ఘన స్వాగతం
Mpox Case India: దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో అలర్ట్! తొలి మంకీపాక్స్ కేసు నమోదు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
హ్యుందాయ్‌ అల్కాజర్‌ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల- రెండు ఫ్యామిలీలు దర్జాగా వెళ్లవచ్చు!
Pawan Kalyan: బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బుడమేరులో అక్రమ నిర్మాణాలపై, హైడ్రాపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
వరద బాధితులకు చిన్నారుల గొప్ప సాయం - పాకెట్ మనీని ఇచ్చిన విద్యార్థులు, వీడియో షేర్ చేసిన సీఎం చంద్రబాబు
Bengaluru Rameshwaram Cafe Blast :  వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
వాళ్లది చాలా పెద్ద ప్లాన్ - బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌ టెర్రరిస్టులపై NIA చార్జిషీటు
Embed widget