By: ABP Desam | Updated at : 14 Sep 2023 04:20 PM (IST)
Photo Credit : Shah Rukh Khan/Instagram
బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ నార్త్, సౌత్ ఆడియన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది. ఆడియన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా ప్రెజెంట్ 'జవాన్' ఫీవర్ లోనే ఉన్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ మూవీ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మన టాలీవుడ్ తరఫునుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'జవాన్'ని ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశాడు.
"జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ తో టీమ్ అందరికీ శుభాకాంక్షలు. సినిమాలో నటీనటులు, టెక్నీషియన్లు, సిబ్బంది, ప్రొడ్యూసర్లు అందరికీ నా అభినందనలు. షారుక్ ఖాన్ గారి మాసియస్ట్ అవతార్ ఇది. తన స్వాగ్ తో ఇండియాని, ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్" అని బన్నీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ కి షారుక్ ఖాన్ తాజాగా స్పందించారు." థాంక్యూ సో మచ్ మ్యాన్. స్వాగ్ విషయానికి వస్తే పైరే నన్ను పొగుడుతుంది. వావ్ చాలా సంతోషంగా ఉంది. జవాన్ సక్సెస్ రెట్టింపు అయింది. నేను పుష్ప మూవీ మూడు రోజుల్లో మూడుసార్లు చూశాను. నీ నుంచి నేను నేర్చుకోవాలి. నా నుంచి నీకు పెద్ద హగ్. టైం దొరికినప్పుడు నేరుగా వచ్చి కౌగిలించుకుంటా, కీప్ స్వాగింగ్ లవ్ యూ" అని బన్నీ కి రిప్లై ఇచ్చారు. దీంతో షారుక్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Thank u so much my man. So kind of you for the love and prayers. And when it comes to swag and ‘The Fire’ himself praises me….wow…it has made my day!!! Feeling Jawan twice all over now!!! I must admit I must have learnt something from you as I had seen Pushpa thrice in three… https://t.co/KEH9FAguKs
— Shah Rukh Khan (@iamsrk) September 14, 2023
కాగా 'పుష్ప' సినిమాకి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ ఏడాది చివరిలోనే సినిమాను విడుదల చేయాలనుకున్నారు, కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ ని వచ్చే ఏడాది ఆగస్టు 15 కి వాయిదా వేశారు. ఇక 'జవాన్' విషయానికి వస్తే.. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మొదటి రోజే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అంటే దాదాపు రోజుకి రూ.100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని మరోసారి షారుక్ స్టామినా ఏంటో నిరూపించింది. 'జవాన్' సక్సెస్ తో ఒకే ఏడాదిలో రెండు(పఠాన్' జవాన్) సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్స్ అందుకున్న హీరోగా షారుక్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. సినిమాలో షారుక్ కి జోడిగా నయనతార హీరోయిన్‌గా నటించగా, విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రియమణి, సానియా మల్హోత్ర, సునీల్ గ్రోవర్, సిరి హనుమంత్ తదితరులు కీలకపాత్రలు పోషించగా, దీపికా పదుకొనే, సంజయ్ దత్ అతిధి పాత్రల్లో మెరిసారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
Also Read : థాంక్స్ చాలదు, సాంగ్స్ అదరగొట్టాలి - అల్లు అర్జున్, అట్లీ సినిమాకు అనిరుధ్ ఫిక్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి
Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్
Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>