Toxic Movie : యశ్ 'టాక్సిక్'లో ఆ బాలీవుడ్ హీరో క్యామియో రోల్ చేస్తున్నాడా?
Yash : కేజీఎఫ్ హీరో యశ్ 'టాక్సిక్' మూవీలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
యశ్ 'టాక్సిక్' లో షారుక్ క్యామియో
యశ్ 'టాక్సిక్' మూవీకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ క్యామియో రోల్ చేస్తున్నారట. 'టాక్సిక్' మూవీ టీమ్ సినిమాలో ఓ క్యామియో రోల్ కోసం ఇటీవల షారుక్ ఖాన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే షారుక్ మాత్రం ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ ని పెండింగ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. కానీ మూవీ టీం ఎలాగైనా షారుక్ ఖాన్ ని నటింపజేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ యశ్ మూవీలో క్యామియో రోల్ చేసేందుకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్టుకి నార్త్ లోను భారీ బజ్ వచ్చే అవకాశం ఉంది.
యశ్‌కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు
యశ్ కెరియర్ లో 19వ ప్రాజెక్ట్ అయిన 'టాక్సిక్' కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ని మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతోనే కరీనాకపూర్ సౌత్ లోకి ఆరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ప్రధాన పాత్రలు ఉండడంతో ఆ పాత్రల కోసం కరీనాకపూర్, శృతిహాసన్, సాయి పల్లవి లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రావణుడిగా 'యశ్'..
బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తతివారి రామాయణం సినిమాని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్, సీతాదేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. 'కేజిఎఫ్' హీరో యశ్ ఇందులో రావణుడి పాత్రను పోషించబోతున్నాడు. జూలైలో యష్ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే మూవీ చేస్తున్న యశ్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాకే రామాయణం సెట్స్ లో అడుగుపెట్టనున్నారట. రామాయణం పార్ట్ వన్ లో యశ్ కనిపించేది కొద్ది సమయం మాత్రమేనని, పార్ట్ 2 మొత్తం రావణుడిగా యష్ పాత్ర పైనే కథ నడుస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read : హీరోల ఇమేజ్‌కు ఇంపార్టెన్స్ ఇస్తే అంతే - 'గుంటూరు కారం'పై ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్