అన్వేషించండి

Shah Rukh Khan: ఆమె ఇద్దరు పిల్లల తల్లి - నయనతారపై షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కచ్చితంగా తన ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయితేనే వారి కెరీర్‌లో చేస్తున్న తప్పుల గురించి, చేయాల్సిన సినిమాల గురించి ఒక ఐడియా వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత హీరోలకు తమ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం మరింత ఈజీగా అయిపోతోంది. ట్విటర్‌లో నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి ‘యాస్క్ మీ ఎనీథింగ్’ అంటూ హీరోలే తమకు ప్రశ్నలను సందింమంటూ ఫ్యాన్స్‌ను ఆహ్వానిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా అలాంటి ఒక ప్రోగ్రామ్‌నే నిర్వహించాడు. ఇందులో తన అప్‌కమింగ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఎస్‌ఆర్‌కే. అయితే నయనతార మీద తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు చాలా సరదా సమాధానం అందించాడు షారుఖ్.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘జవాన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్‌లో పెద్ద హీరో అయ్యిండి అట్లీ లాంటి యంగ్ తమిళ డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వడమేంటి అని మొదట్లో అందరూ ఆశ్చర్యపోయినా.. తాజాగా విడుదలయిన టీజర్ చూస్తుంటే మాత్రం ‘జవాన్’ని చాలా తక్కువ అంచనా వేశామని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఇందులో పూర్తిగా గుండుతో షారుఖ్ కనిపిస్తున్న సీన్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ అప్పుడే చాలా ఆశలు పెట్టేసుకుంటున్నారు. అలాగే ఈ చిత్రం కోసం తొలిసారి నయనతారతో జతకడుతున్నాడు షారుఖ్. 

నయనతారను చూసి మనసు పారేసుకున్నారా.?
నయనతార.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గత 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. అలా సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన తర్వాత తనకు బాలీవుడ్ నుండి చాలానే ఆఫర్లు వచ్చాయి. అయినా కూడా తను ఏ ఒక్క అవకాశాన్ని కూడా అందుకోవాలని అనుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత షారుఖ్ లాంటి స్టార్ హీరోతో కలిసి సినిమా చేసి బాలీవుడ్‌లో గ్రాండ్‌గా డెబ్యూ ఇవ్వనుంది. ‘యాస్క్ ఎస్‌ఆర్‌కె’ అని సోషల్ మీడియాలో తను పెట్టిన ప్రశ్నల సెషన్‌లో ఒక నెటిజన్.. ‘నయనతారను చూసి మనసు పారేసుకున్నారా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా ‘నోరు మూసుకో రెండు పిల్లల తల్లి తను’ అంటూ ఘాటుగానే సమాధానమిచ్చాడు. నయనతార పెళ్లి సమయానికి అట్లీ, షారుఖ్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే నయనతార పెళ్లికి కూడా షారుఖ్ చాలా ప్ర్యతేకంగా హాజరయ్యారు. 

రజినీ అంటే చాలా ఇష్టం..
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ చిత్రం ఎలా ఉందంటూ ఒక ఫ్యాన్.. షారుఖ్‌ను అడిగాడు. ‘నాకు రజినీ సార్ అంటే చాలా ఇష్టం. ఆయన జవాన్ సెట్స్‌లోకి వచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు కూడా.’. అంతే కాకుండా షారుఖ్ సినిమా ‘చక్ దే ఇండియా’ విడుదలయ్యి 16 సంవత్సరాలు పూర్తయ్యింది. దీంతో ఈ మూవీపై కూడా షారుఖ్ స్పందించాడు. ఇక షారుఖ్ అప్‌కమింగ్ మూవీ ‘జవాన్’ మాత్రం సెప్టెంబర్ 7న హిందీతో పాటు తమిళ, తెలుగులో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో షారుఖ్ పలు రకాల గెటప్స్‌లో కనిపించనున్నాడు.

Also Read: సరిహద్దుల్లేని అభిమానం - ‘జైలర్’ కోసం చెన్నైకి వచ్చిన జపాన్ దంపతులు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Kannappa: 'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
'కన్నప్ప' విడుదల వాయిదా - క్షమాపణలు చెప్పిన నటుడు మంచు విష్ణు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Swati Sachdeva: రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి  కుళ్లు జోకులు
రణవీర్ అల్లాబదియాకు ఫీమేల్ వెర్షన్ స్వాతి సచ్‌దేవ - తల్లి వైబ్రేటర్ గురించి కుళ్లు జోకులు
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Embed widget