Shah Rukh Khan: రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అడుక్కుంటున్నా - తమిళ దర్శకుడిని ప్రాధేయపడిన షారుఖ్
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్, మణిరత్నం కాంబినేషన్‌లో 26 ఏళ్ల క్రితం ‘దిల్ సే’ సినిమా వచ్చింది. ఈ కాంబోలో అలాంటి మరొక సినిమాను చూడాలని ప్రేక్షకులు ఆశపడగా షారుఖ్.. దానికి రియాక్ట్ అయ్యాడు.
Shah Rukh Khan: కొంతమంది దర్శకులు, హీరోలు చేతులు కలిపితే చూడాలని ప్రేక్షకులకు చాలా ఆశగా ఉంటుంది. అలా ప్రతీ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి మణిరత్నం, షారుఖ్ ఖాన్ కాంబినేషన్. ఒకరేమో ఇంకా కోలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ.. హిట్లు కొడుతున్న డైరెక్టర్. ఒకరేమో తన సినిమాలతో వరల్డ్ బాక్సాఫీస్‌లోనే రికార్డులను సృష్టిస్తున్న హీరో. ఇక ఈ హీరో, దర్శకుడి కాంబినేషన్‌లో 26 ఏళ్ల క్రితం ‘దిల్ సే’ అనే సినిమా వచ్చింది. ఆ ఒక్క మూవీతో హిట్ కొట్టి మళ్లీ మళ్లీ వీరు కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూసేలా చేశారు. ఇక ఫైనల్‌గా వీరిద్దరి కాంబోలో సినిమాపై షారుఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక్క సినిమా చేయండి..
తాజాగా ఒక ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, మణిరత్నం కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయిన చాలామంది ప్రేక్షకులు.. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు అని అడగడం మొదలుపెట్టారు. దానికి ముందుగా షారుఖ్ ఫన్నీగా రెస్పాండ్ అయ్యాడు. ‘‘మణి సార్ ఏంటి మరి ఇప్పుడు? ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ప్రతీసారి మీకు చెప్తూనే ఉన్నాను. మీరు నాతో ఒక్క సినిమా చేయండి. నేను మాటిస్తున్నాను ఈసారి ట్రైన్‌పైన ఏంటి.. ఏకంగా విమానంపైనే చయ్య చయ్య పాటకు స్పెప్పులేస్తాను’’ అని మణిరత్నంతో సినిమా చేయడానికి తను ఎంతగా తపనపడుతున్నాడో బయటపెట్టాడు షారుఖ్ ఖాన్.
దిగులు పడకు..
ఇక షారుఖ్ చెప్పిన మాటలు విన్న తర్వాత తనతో ఎప్పుడు సినిమా చేస్తారు అని ఆడియన్స్ కూడా అడగడం మొదలుపెట్టారు. దానికి సమాధానంగా ‘‘నేను విమానం కొన్నప్పుడు’’ అని చెప్పారు మణిరత్నం. అయితే ‘‘నేను విమానం కొంటే ఓకేనా?’’ అని షారుఖ్ అడిగాడు. ‘‘అప్పుడైనా చేస్తాను’’ అని మణిరత్నం పాజిటివ్‌గా సమాధానం ఇచ్చారు. దీంతో సంతోషంలో మునిగిపోయిన షారుఖ్.. ‘‘మణి నేను మీకు ఒక విషయం చెప్పనా.. నా సినిమాలు నడుస్తున్న తీరుకు నేను విమానం కొనడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. నేను వచ్చేస్తున్నా. నేను కచ్చితంగా నీతో కలుస్తా. దిగులు పడకు’’ అన్నాడు. ఇక షారుఖ్, మణిరత్నం సంభాషణను విన్న ఆడియన్స్.. నిజంగానే వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.
Maniratnam- i'll work with him when he buys a plane
— ح (@hmmbly) January 10, 2024
SRK- the way my films are doing that plane isnt far away 😭
Such a wholesome interaction b/w both the legends 💖 pic.twitter.com/6dKPwzzugR
మొత్తంగా రూ.2500 కోట్లు..
బాలీవుడ్‌లో బాద్‌షాగా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్.. గత కొన్నాళ్లుగా ఫ్లాపులలో మునిగిపోయి ఉన్నాడు. ఎన్నో ఫ్లాపుల్ తర్వాత 2023 జనవరిలో విడుదలయిన ‘పఠాన్’ సినిమా తనను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. ఇక ఈ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ‘జవాన్’ అనే మరో సినిమాను విడుదల చేశాడు. ‘పఠాన్’ తరహాలోనే ‘జవాన్’ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇక 2023 చివర్లో రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకే ఏడాది మూడు సినిమాలు విడుదల చేసిన స్టార్ హీరోగా రికార్డును అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూడు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా రూ.2500 కోట్ల కలెక్షన్స్‌ను సాధించాడు షారుఖ్ ఖాన్.
Also Read: విజమ్ సేతుపతి, కత్రినా కైఫ్ 'మేరీ క్రిస్మస్' ఫస్ట్ రివ్యూ