అన్వేషించండి

Actor Siva Krishna: ఆర్కే రోజా చాప్టర్‌ క్లోజ్‌, పిఠాపురంలో గెలిచేది ఆయనే - ఏపీ ఎన్నికలపై నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు 

Actor Siva Krishna on RK Roja: ఏపీ ఎన్నికలపై నటుడు శివ కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి రోజా రాజకీయ జీవితం ముగిసినట్టేనన్నారు. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ భారీ మెజారిటీ గెలుస్తారంటూ జోస్యం చెప్పారు.

Actor Siva Krishna Sensational Comments on RK Roja: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కానీ అందరి చూపు ఏపీ ఫలితాలపైనే ఉంది. అధికారం చేపట్టేది ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు.  సర్వేలు సైతం ఖచ్చితం తేల్చడం లేదు. కానీ, ఎవరికి వారు గెలిచేది మేమే.. అధికారం మాదే అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో సీనియర్‌ నటుడు శివకృష్ణ ఏపీ రాజకీయాలు, ఎన్నికలపై స్పందించారు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూల ఆయన సీఎం జగన్‌, ఆ పార్టీ ఎమ్మెల్యే, మంత్రులపై షాకింగ్‌ కామెంట్స్‌  చేశారు.

ముఖ్యంగా మంత్రి రోజా రాజకీయ జీవితం ముగిసినట్టే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "వైఎస్‌ షర్మిలా చెప్పినట్టుగా వైఎస్సార్‌ సీపీలో ఉన్నవాళ్లంతా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్లిపోయే పరిస్థితి వస్తుందన్నారు. తెలంగాణలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ఏపీలోనూ అదే జరుగుతుందన్నారు. ఇక్కడ టీడీపీ వాళ్లంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌ రాగానే మళ్లీ అక్కడి నుంచి ఈ పార్టీకి వచ్చారు. ఏపీలోనూ అదే పరిస్థితి వస్తుంది. కానీ, మంత్రి ఆర్కే రోజా, కొడాలి నాని చాప్టర్‌ క్లోజ్‌ అయిపోయినట్టే. అవతల పార్టీ కనుక వాళ్లని తీసుకుంటే సర్వైవ్‌ అవ్వోచ్చు. లేదంటే వారి రాజాకీయ జీవితం ముగిసినట్టే" అంటూ వ్యాఖ్యానించారు. 

రోజా రాజకీయ జీవితం ముగిసినట్టే

అనంతరం మాట్లాడుతూ.. "ఎవరేవరైతే ఓడిపోతున్నారో వారి వల్గర్‌ మాటలు పార్టీకి కూడా నెగిటివిటీ వచ్చింది. రాజకీయాల్లో విమర్శలు అనేవి కామన్‌. కానీ వాటికంటే ఒక లిమిట్‌ ఉంటుంది. అది దాటి వెళ్లకూడదు. కానీ ఈ నాయకులు వ్యక్తిగత జీవితంలోకి కూడా వెళ్లి మరి దూషించడం, బూతులు తిట్టడం. చాలా వల్గారిటీ భాష వాడారు. తమ నాయకుడి మెప్పు పొందేందుకు నోటికి ఎంత్త వస్తే అంత మాట్లాడుతూ ప్రత్యర్థులను దూషించారు. ఒక మాజీ సీఎం పట్టుకుని వాడు వీడు అనడం అసలు సమంజసమేనా. ఒకప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటి మాటలు వినలేదు. రాజకీయం వరకే మాత్రమే మాట్లాడేవాళ్లు. కానీ ఇక్కడ పెళ్లాం, పిల్లలంటూ కుటుంబం వరకు వెళుతున్నారు. పర్సనల్‌ లైఫ్‌లోకి వెళ్లి మరి విమర్శించారు. ఎవరికైనా భార్య, పిల్లలు ఉంటారు. కానీ అలా మాట్లాడటం అసలు కరెక్ట్‌ కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు. 

పవన్ 40వేల మెజారిటీతో గెలుస్తాడు

అలాగే పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడారు. పిఠాపురంలో గెలిచేది ఆయనే అన్నారు. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ తప్పుకుండ గెలుస్తారని, 40 వేల నుంచి 50 వేల మేజారిటీ గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఆయన మాట తప్పని మనిషి. ఇప్పుడు ఉన్న రాజకీయా నాయకులు ఎవరూ ఆయన ఉన్నారు? పొత్తుకు ముందు ఏం చెప్పారో అదే చేశారు. ఓట్లు చీలిపోకూడదనే టీడీపీ పొత్తు కుదుర్చుకుంటున్నానన్నారు, అన్నట్టుగానే కలిశారు. ఇక సీట్ల విషయంలోనే చెప్పిందే చేశారు. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదని, వైఎస్‌ జగన్‌ ఓడించడమే తమ లక్షమన్నారు. అన్నట్టుగానే సీట్లు కేటాయించినా కూడా సర్దుబాటులో రెండు ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు వదలుకున్నారని గుర్తు చేశారు. అంతేకాదు సొంత అన్నయ్య నాగాబాబుకు ఇచ్చిన ఎంపీ సీటు వదులుకున్నారు, అలా ఎవరుంటారంటూ పవన్‌ కళ్యాణ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం నటుడు శివకృష్ణ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి.తన అభిప్రాయ ప్రకారం ఏపీ గెలిచేది కూటమే అంటూ పరోక్ష కామెంట్స్‌ చేయడం ఇటూ ఇండస్ట్రీ, అంటూ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 

Also Read: ఆ అమ్మాయిల కోసమే ఇంక పెళ్లి చేసుకోలేదు.. త‌న పోస్ట్ వెనుక ఉన్నదెవ‌రో చెప్పిన ప్ర‌భాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget