అన్వేషించండి

Divya Bharti: దివ్య భారతి మరణానికి కారణం అదే - సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్

Divya Bharti Death: అప్పట్లో హీరోయిన్ దివ్య భారతి మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. అసలు అలా ఎలా జరిగిందంటూ అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా తన కో యాక్టర్ కమల్ సాధన ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Kamal Sadanah About Divya Bharti Death: సినీ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్న తర్వాత కొందరు నటీనటులు అనుమానస్పద రీతిలో మృతిచెందారు. అందులో హీరోయిన్ దివ్య భారతి కూడా ఒకరు. చాలా చిన్న వయసులో స్టార్ హీరోలతో నటించి.. టాలీవుడ్, బాలీవుడ్‌ను తనవైపు తిప్పుకున్నారు దివ్య భారతి. కానీ అనూహ్యంగా 19 ఏళ్లకే ఆమె కన్నుమూశారు. ముంబాయ్‌లోని తన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పడిపోయి మృతిచెందారు. కానీ ఇప్పటికీ దివ్య భారతి మృతిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఆమె మరణంపై సీనియర్ హీరో, ఒకప్పటి నటుడు కమల్ సాధన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిజం కాదేమో..

‘‘దివ్య భారతి మరణ వార్తను వినడం చాలా కష్టంగా అనిపించింది. చాలా బాధగా అనిపించింది. ఎంతో టాలెంట్ ఉన్న నటీమణుల్లో తాను కూడా ఒకరు. తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించేది. దివ్యకు మాత్రమే శ్రీదేవిని ఓపెన్‌గా ఇమిటేట్ చేసే ధైర్యం ఉండేది. అలా ఓపెన్‌గా చేయొద్దు అని చెప్పినా వినేది కాదు. తనెప్పుడూ సంతోషంగా ఉండేది. అందుకే తన మరణ వార్త విన్నప్పుడు చాలా షాకింగ్‌గా అనిపించింది. నేను అప్పుడే తనతో షూటింగ్ పూర్తి చేసుకున్నాను. అలా ఎలా జరుగుతుంది? ఇదంతా నిజం కాదేమో అనుకున్నాను’’ అంటూ దివ్య భారతి మరణ వార్త విన్నప్పుడు తనకు ఎలా అనిపించిందో గుర్తుచేసుకున్నారు కమల్ సాధన.

నేను నమ్ముతున్నాను..

దివ్య భారతి మరణించే సమయానికి తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయని, అవన్నీ జరిగుంటే తనే తరువాతి సూపర్ స్టార్ అయ్యిండేదని కమల్ సాధన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నా నమ్మకం ఏంటంటే తను అప్పటికే కొంచెం మందు తాగింది. ఆ క్రమంలో తను జారి కింద పడిపోయి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అది కచ్చితంగా ఒక యాక్సిడెంట్ అని నేను బలంగా నమ్ముతున్నాను. తను చనిపోవడానికి కొన్నిరోజుల ముందు వరకు నేను తనతో షూట్ చేస్తున్నాను. అప్పుడు కూడా తను బాగానే కనిపించింది. తనకు ఎలాంటి సమస్యలు లేవు. తను ఎన్నో గొప్ప సినిమాలు చేసింది, మరెన్నో గొప్ప సినిమాలను సైన్ చేసింది’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కమల్.

హత్య, ఆత్మహత్య కాదు..

‘విశ్వాత్మ’, ‘షోలా ఔర్ షబ్నం’, ‘దీవానా’ వంటి చిత్రాలతో దివ్య భారతికి విపరీతమైన పాపులారిటీ లభించింది. అయితే తన మృతి సహజంగా లేదని, దాని చుట్టూ ఎన్నో రూమర్స్ వస్తుండడంతో.. అప్పట్లో దివ్య భారతి తండ్రి స్వయంగా దీనిపై స్పందించారు. హత్య, ఆత్మహత్య లాంటిది ఏమీ జరిగుండదని, కచ్చితంగా అది యాక్సిడెంటే అయ్యింటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటికే దివ్య భారతి మందు తాగి ఉందని బయటపెట్టారు. తన అపార్ట్మెంట్ 5వ ఫ్లోర్‌లో ఉండగా.. అక్కడే బాల్కనీలోని గోడపై తన కూర్చొని ఉండగా.. పొరపాటున స్లిప్ అయ్యి పడిపోయి ఉంటుందని దివ్య భారతి తండ్రి ప్రకటించారు.

Also Read: ఇప్పుడు శ్రీవల్లి 2.0ను చూస్తారు, ‘పుష్ప 2’ మూవీపై రష్మిక క్రేజీ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Redmi A4 5G: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Redmi A4 5G: దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
దేశంలోనే అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.10 వేలలోపే రెడ్‌మీ ఏ4 5జీ!
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Haryana Rohingya Connection: రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ -  హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
రోహింగ్యాలను ఓటు బ్యాంకుగా చేసుకున్న కాంగ్రెస్ - హర్యానా ఎన్నికల్లో బయటపడిన కీలక అంశం
Train Accident: మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
మరో రైలు ప్రమాదం - పట్టాలు తప్పిన అగర్తలా లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్
AP IAS : ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్‌లు - త్వరలో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం
Revanth Reddy : మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూసీ పునరుజ్జీవానికి ప్రయత్నిస్తున్నాం - ప్రజలు చెబితే ఆపేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Embed widget