Pekamedalu: ‘పేకమేడలు’ ప్రమోషన్స్ - చివరికి మాజీ సీఎం జగన్‌ను కూడా వదల్లేదుగా, ఆ ట్రోల్స్ ఏందయ్య సామి!
Pekamedalu Promotions: ‘పేకమేడలు’ సినిమా ప్రమోషన్స్‌కు ఇప్పటికే ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ ఈ సినిమాను ప్రమోట్ చేశాడు ఇన్‌ఫ్లుయెన్సర్ సాత్విక్ ఆనంద్.
Pekamedalu Movie Promotions: ఈరోజుల్లో మేకర్స్ కూడా ప్రమోషన్స్ విషయంలో చాలా డిఫరెంట్ ఐడియాలతో ముందుకొస్తున్నారు. అలా అయితేనే సినిమా ఎక్కువమందికి ప్రేక్షకులకు రీచ్ అవుతుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా త్వరలో విడుదలకు సిద్దమయిన ‘పేకమేడలు’ మూవీ టీమ్ చేస్తున్న ప్రమోషన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ట్రెండింగ్‌లో ఉన్న ప్రతీ విషయాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రమోషన్ చేస్తోంది ‘పేకమేడలు’ టీమ్. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ మరొక ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోను చూసి కూడా నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
జగన్‌గా సాత్విక్..
ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో చాలామందికి ఒక సెపరేట్ స్టైల్ ఉంది. అందులో సాత్విక్ ఆనంద్ కూడా ఒకడు. ‘మన కులపోడే’ అనే డైలాగ్‌తో ఫేమస్ అయిపోయాడు సాత్విక్. తాజాగా ‘పేకమేడలు’ టీమ్‌తో కలిసి చేసిన ప్రమోషనల్ వీడియోలో తనే వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్వించాడు. అంతే కాకుండా ఈ వీడియో మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయిన జగన డీజే సాంగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ వీడియోలో ముందుగా సాత్విక్.. ‘పేకమేడలు’ హీరోయిన్ అయిన అనుష కృష్ణ దగ్గరకు వచ్చి జగన్ మ్యానరిజంతో ప్రాబ్లమ్ ఏంటి అని అడగగా.. ‘మా ఆయన రమ్మీ ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, కొడుకును కూడా బాగా చూసుకోవడం లేదు’ అని చెప్తుంది అనూష.
నా పేరు శివలో విలన్..
అదే సమయంలో ‘పేకమేడలు’ హీరో వినోద్ కిషన్ కూడా అక్కడికి వస్తాడు. తనను చూడగానే సాత్విక్.. ‘వీడేంటి చూడడానికి నా పేరు శివ సినిమాలో విలన్‌లాగా ఉన్నాడు’ అని కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత తన భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడుగుతాడు. దానికి సమాధానంగా ‘‘నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా అన్నా.. పొద్దునే రమ్మీ ఆడుతా, సాయంత్రం అప్పు చేస్తా, రాత్రికి మందు తాగుతా, ఈ మధ్యలో ఎప్పుడూ బిజినెస్ ప్లాన్స్ ఆలోచిస్తూనే ఉంటా’’ అని వినోద్ కిషన చెప్పగానే వెంటనే తనను పోలీసులకు పట్టిస్తాడు సాత్విక్.
View this post on Instagram
థియేటర్‌కు వెళ్లి చూస్తాను..
‘పేకమేడలు’ మూవీ జులై 19న విడుదల అవుతుందని చెప్పడంలో కూడా జగన్ మ్యానరిజంను మెయింటేయిన్ చేశాడు సాత్విక్. ‘‘ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆ లక్ష్మణ్ చేసే ప్రతీ దారుణాన్ని, ప్రతీ అన్యాయాన్ని కూడా 19వ తారీఖు నేను నేరుగా థియేటర్‌కు వెళ్లి చూస్తాను. వాడి సంగతి చూస్తాను’’ అని తెలిపాడు. దీంతో ఈ ప్రమోషనల్ వీడియోకు మరోసారి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే కొందరు ఈ విషయాన్ని నెగటివ్‌గా కూడా తీసుకుంటున్నారు.
Also Read: ‘విరాజి’ ట్రైలర్ - ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్, అసలు ఆ మెంటల్ హాస్పిటల్‌లో ఏం జరిగింది?