Saripodhaa Sanivaaram Vs Dasara: 'సరిపోదా శనివారం'కు హిట్ టాక్... కానీ దసరా రికార్డ్ సేఫ్... ఫస్ట్ డే ఏ సినిమాకు ఎంత వచ్చాయంటే?
Saripodhaa Sanivaaram First Day Collection: సరిపోదా శనివారానికి ఫస్ట్ డే హిట్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్స్ ఆశించినంత రాలేదని, నాని 'దసరా'తో కంపేర్ చేస్తే తక్కువ కలెక్ట్ చేసిందని టాక్.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కలిసి చేసిన తొలి సినిమా 'అంటే సుందరానికి'. కమర్షియల్ పరంగా సక్సెస్ కాలేదు. ఆ సినిమా షేర్ రూ. 23 కోట్లు అని, ఆ జానర్ సినిమాకు అంత రావడం ఎక్కువ అని, కాకపోతే ఎక్కువ బిజినెస్ చేయడం వల్ల కలెక్షన్స్ లెక్కల పరంగా వెనుకబడిందని నాని తెలిపారు. 'అంటే సుందరానికి' తర్వాత వివేక్ ఆత్రేయతో కలిసి మాస్ యాక్షన్ ఫిల్మ్ 'సరిపోదా శనివారం' చేశారు. ఈ సినిమా ఓపెనింగ్స్ బావున్నాయి. అయితే... నాని బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్స్ బీట్ చేయడంలో వెనుకబడిందని ట్రేడ్ టాక్.
'సరిపోదా శనివారం' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?
'సరిపోదా శనివారం' ఫస్ట్ డే కలెక్షన్స్ అటు ఇటుగా 9 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది షేర్ మాత్రమే. ఏపీ, తెలంగాణ - ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.5 కోట్ల షేర్ రాబట్టింది. ఆల్ ఓవర్ ఇండియా రూ. 8.50 కోట్లు కలెక్ట్ చేసింది.
'సరిపోదా శనివారం' చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు కూడా బావున్నాయి. నాని ఇమేజ్, ట్రైలర్ వంటివి ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో ఆల్మోస్ట్ 1 మిలియన్ మార్క్ రీచ్ అవుతోంది. ప్రీమియర్స్ కాకుండా మొదటి రోజు సుమారు 300కె డాలర్స్ వరకు కలెక్ట్ చేసిందని అంచనా. ఫస్ట్ డే ఆల్మోస్ట్ 9 కోట్ల షేర్ అంటే మంచి అమౌంట్.
'దసరా' ఫస్ట్ డే ఎంత... సరిపోదా ఎక్కడ ఉంది?
'దసరా' సినిమాకు ఫస్ట్ డే రూ. 38 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని ప్రొడక్షన్ హౌస్ ఎస్‌ఎల్‌వి సినిమాస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే... షేర్ వచ్చి రూ. 23.50 కోట్లు ట్రేడ్ వర్గాల టాక్. దాంతో కంపేర్ చేస్తే 'సరిపోదా శనివారం' వెనుక పడిందని బాక్సాఫీస్ పోర్టల్స్ చెబుతున్నాయి.
'దసరా' ఓపెనింగ్ కలెక్షన్స్‌లో 50 పర్సెంట్ కూడా 'సరిపోదా శనివారం' సినిమాకు రాలేదు. కలెక్షన్స్ కంపేర్ చేసే ముందు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి... పక్కా మాస్ సినిమా 'దసరా'. 'సరిపోదా శనివారం' అలా కాదు. హీరోకి హిట్స్ ఉన్నా... ఈ సినిమా దర్శకుడు ఇంతకు ముందు ఫీల్ గుడ్ ఫిలిమ్స్, లైట్ హార్ట్ కామెడీ మూవీస్ తీశాడు. ఇప్పుడు మాస్ సినిమా తీసినా సరే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కాస్త ఆలోచిస్తారు. అందువల్ల, ఓపెనింగ్స్ తక్కువ వచ్చాయి. అయితే హీరో లాస్ట్ సినిమా కలెక్షన్లతో ప్రజెంట్ సినిమా కలెక్షన్లు కంపేర్ చేయడం కామన్ కదా!
Also Read: సరిపోదా శనివారం రివ్యూ: నాని మాస్ హీరోయిజం వర్సెస్ ఎస్.జె. సూర్య విలనిజం - సినిమా ఎలా ఉందంటే?
'సరిపోదా శనివారం' సినిమాలో హీరో నాని కంటే విలన్ రోల్ చేసిన ఎస్.జె. సూర్య ఎక్కువ హైలైట్ అవుతున్నాడు. ఆయనకు ఎక్కువ పేరు వస్తోంది. ఆడియన్స్ సూర్య విలనిజం గురించి మాట్లాడుతున్నాడు. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. యాక్షన్ సీన్లకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని పేరు వచ్చింది.