Couple Friendly Teaser: సంతోష్ శోభన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ - 'కపుల్ ఫ్రెండ్లీ' టీజర్ చూశారా!
Couple Friendly: యంగ్ హీరో సంతోష్ శోభన్ లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ' టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Santosh Sobhan's Couple Friendly Telugu Teaser Released: మ్యాడ్ ఫేం సంతోష్ శోభన్, మానస వారణాసి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ'. ఈ మూవీ నుంచి టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
టీజర్ ఎలా ఉందంటే?
నెల్లూరుకు చెందిన ఓ యువకుడు శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటాడు. ఖర్చుల కోసం చెన్నై నగరంలో బైక్ పూలింగ్ చేస్తుంటాడు. ప్రీతి (మానస వారణాసి) శివ బైక్‌పై జర్నీ చేస్తుంది. అపరిచితులుగా కలిసిన శివ, ప్రీతి ఒకరినొకరు పరిచయం చేసుకుని ప్రేమికులుగా మారతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. సంతోష్, మానస మధ్య లవ్ సీన్స్‌ను టీజర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.
ఈ టీజర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేయగా... 'స్పార్క్స్ ఇన్ యువర్ ఐస్, దే షైన్..' అంటూ సాగే బిట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం' అంటూ టీజర్ చివరలో వేసిన క్యాప్షన్ "కపుల్ ఫ్రెండ్లీ" బ్యాక్ డ్రాప్‌ను రిఫ్లెక్ట్ చేస్తోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ భారీగా నిర్మిస్తోంది. అశ్విని చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా... త్వరలో తెలుగుతో పాటు తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
From kisses that felt like forever…
— UV Creations (@UV_Creations) August 8, 2025
To memories we can’t forget.
This is love. This is #CoupleFriendly ❤️#CoupleFriendlyTeaser out now in Telugu & Tamil ✨
▶️ https://t.co/WDmlNT6qeW
In cinemas soon in Telugu & Tamil ✨@santoshsoban @varanasi_manasa @manojac @ajayraju911… pic.twitter.com/zv3kajdfXS
Also Read: కలర్ ఫుల్‌గా ఓనమ్ సాంగ్ - కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' పాట వచ్చేసింది






















