Sanjjanaa Galrani: అలా చేస్తే నా లీగల్ టీమ్ మిమ్మల్ని వదలదు - సంజనా గల్రానీ స్ట్రాంగ్ వార్నింగ్
Sanjjanaa Galrani: ‘బుజ్జిగాడు’తో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సంజనా గల్రానీ మతంపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు నడిచాయి. అయితే దాని గురించి తప్పుగా మాట్లాడేవారికి సంజనా వార్నింగ్ ఇచ్చారు.
Sanjjanaa Galrani: ప్రభాస్ హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది సంజనా గల్రానీ. తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా కూడా ఇప్పటికీ తనను ‘బుజ్జిగాడు’ బ్యూటీగానే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. కొన్నాళ్ల క్రితం వరకు సంజనా ఎక్కువగా తన పర్సనల్ లైఫ్‌లోని విషయాల వల్లే వార్తల్లో నిలిచేది. తను హిందువు అయినా కూడా ఇస్లాం మతాన్ని నమ్ముకోవడంతో తనపై విమర్శలు వచ్చాయి. చాలామంది అసభ్యకరంగా కామెంట్స్ కూడా పెట్టారు. వాటికి ఎప్పటికప్పుడు సమాధానం చెప్తూ వచ్చారు సంజనా. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
అది నా పర్సనల్ ఛాయిస్..
‘‘మతం అనేది చాలా వ్యక్తిగత విషయం. మీరు దేన్ని నమ్ముతారో నమ్మండి. కామెంట్స్‌లో తప్పుగా మాట్లాడి నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తే చాలా తప్పు. నాకు హిందూ దేవుళ్ల మీద ఎంత నమ్మకం ఉందో.. ముస్లిం దేవుడిపై కూడా అంతే నమ్మకం ఉంది. నేను 12 ఏళ్లు ఒక క్రిస్టియన్ స్కూల్‌లో చదివాను. అందులో చర్చి ఉండేది. నేను ముందుగా చర్చికి వెళ్లి తర్వాతే క్లాస్ రూమ్‌కు వెళ్లేదాన్ని. అది నాకు ఎవరూ నేర్పించలేదు. నాకే అనిపించేది. అందుకే నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాకు అందరు దేవుళ్లంటే సమాన ఇష్టం. అయినా ప్రతీసారి నన్ను నేను ఎందుకు నిరూపించుకోవాలి. నా మతం ఏంటి? నేనేం ఫాలో అవుతాను అనేది నా పర్సనల్ ఛాయిస్. నేను ఇది చేస్తున్నాను, మీరూ ఇది చేయండి అని నేను చెప్పట్లేదు’’ అని మతం విషయంలో వస్తున్న కామెంట్స్‌పై ఘాటుగా స్పందించారు సంజనా గల్రానీ.
నేను ఎవరి జోలికి వెళ్లను..
‘‘మీ జీవితంలో ఎంత కరెక్ట్‌గా ఉన్నారో చూసుకోండి. వేరే వాళ్ల జీవితంలో ఎందుకు అదే పనిగా జోక్యం చేసుకుంటారు. ఇంతకు ముందు ఏదైనా రాసేవాళ్లు, ఏదైనా క్రియేట్ చేసేవాళ్లు. కానీ గత రెండేళ్ల నుండి కొంతమందికి చాలా గట్టిగా జవాబు ఇచ్చాను. దాని తర్వాత నా జోలికి రావట్లేదు. రెండుసార్లు ఆలోచించుకుంటున్నారు. నేను ఎవరి జోలికి వెళ్లను. నా పనిలో నేను తృప్తిగా ఉంటాను. నా గురించి తప్పుగా రాస్తే నా లీగల్ టీమ్ మిమ్మల్ని వదలదు. జాగ్రత్త’’ అంటూ నెగిటివ్‌గా కామెంట్స్ చేసేవారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు సంజనా. ఇక తన ఫ్యామిలీ అనేది తనకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుందని సంజనా చెప్పుకొచ్చారు. తన చెల్లి నిక్కీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
కొత్త విద్యలు నేర్చుకున్నాను..
ఒక యాక్టర్ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో.. సందర్భం దొరికినప్పుడల్లా చాలామంది నటీనటులు చెప్తూనే ఉన్నారు. ఇక సంజనా కూడా యాక్టర్ లైఫ్ అంటే అంత సింపుల్ కాదని చెప్పుకొచ్చారు. వరుసగా షూటింగ్స్‌లో పాల్గొనాల్సి వస్తుందని, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుందని, అలాగే సినిమాల కోసం తాను కూడా చాలా కొత్త విద్యలు నేర్చుకున్నానని తెలిపారు. గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘సాయంత్రం 5.30 అయ్యి, గుర్రానికి నీరసం వస్తే దానిపై సంజనా కూర్చుందా, స్టంట్ మాస్టర్ కూర్చున్నాడా, ఐశ్వర్య రాయ్ కూర్చుందా అని ఏమీ పట్టించుకోదు. అలా ఒకరోజు గుర్రానికి నీరసం వచ్చి తీసుకెళ్లిపోయింది నన్ను కూడా. నేను దానిని గట్టి హగ్ చేసుకొని పట్టుకొని మ్యానేజ్ చేశాను’’ అని బయటపెట్టారు సంజనా గల్రానీ.
Also Read: షారుఖ్ ఖాన్‌తో ఉర్ఫీ సెల్పీ - ఊహించని ట్విస్ట్, ఇలా కూడా చెయ్యొచ్చా?