Prabhas Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా - అదేమిటో తెలుసా?
Sandeep Reddy Vanga: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు కిర్రాక్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. 'స్పిరిట్' గురించి ఓ కబురు చెప్పారు. అది ఏమిటో తెలుసా?
దీపావళి... థియేటర్లలో తూటాల దీపావళి ఎలా ఉంటుందో హిందీ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా తీసిన 'యానిమల్' సినిమాతో చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. భారతీయ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ అప్డేట్ ఈరోజు వచ్చింది.
ప్రభాస్ అభిమానులకు కిర్రాక్ అప్డేట్!
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించే సినిమాకు 'స్పిరిట్' (Spirit Movie) టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రభాస్ సెట్స్ మీదకు వెళ్లడానికి టైం పట్టొచ్చు ఏమో కానీ సినిమా పనులు మొదలు పెట్టడానికి అసలు టైం తీసుకోవడం లేదు సందీప్ రెడ్డి వంగా. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'అర్జున్ రెడ్డి'తో పాటు 'యానిమల్'కు రీ రికార్డింగ్ చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్... ఇప్పుడు 'స్పిరిట్' సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు. 'స్పిరిట్' మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనట్లు ఆయన ట్వీట్ చేశారు. దీపావళికి రెబల్ స్టార్ అభిమానులకు వచ్చిన కిరాక్ అప్డేట్ ఇది.
Also Read: గ్లోబల్ స్టార్ దీపావళి ధమాకా... టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ లుంగీ లుక్ మామూలుగా లేదమ్మా
"Music work just began"#spirit#sandeepreddyvanga#bhadrakalipictures#Tseries pic.twitter.com/h5Qf6hjBPY
— Harshavardhan Rameshwar (@rameemusic) October 31, 2024
'స్పిరిట్' కంటే ముందు ప్రభాస్ చేతిలో...
'స్పిరిట్' కంటే ముందు ప్రభాస్ ఫినిష్ చేయాల్సిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ సినిమా 'ది రాజా సాబ్' చిత్రీకరణ దాదాపుగా చివరకు వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సో ముందు ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసే పనిలో ఆయన ఉంటారు. హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమానూ కంప్లీట్ చేయాలి
'స్పిరిట్' కంటే ముందు రెండు సీక్వెల్స్ కూడా ప్రభాస్ ఫినిష్ చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'సలార్' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది అందులో ఫైట్ సీక్వెన్స్, మరీ ముఖ్యంగా కాటేరమ్మ ఎపిసోడ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఆ సినిమాకు సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో పాటు 'కల్కి 2898 ఏడీ' సినిమా సీక్వెల్ కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. వాటికి తోడు తన సినిమా చేసేటప్పుడు మరొక సినిమా షూటింగ్ ఏది పెట్టుకోవద్దని ప్రభాస్ దగ్గరకు వెళ్లి సందీప్ రెడ్డి వంగా రిక్వెస్ట్ చేశారట.
Also Read: క రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?
'స్పిరిట్'లో ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. ఆ సినిమా కోసం ప్రభాస్ సరికొత్తగా మేకోవర్ అవుతారని, ఆ సినిమా లుక్ వల్ల ఇతర సినిమాల షెడ్యూల్స్ గాని తన సినిమా షెడ్యూల్ గాని ఇబ్బంది పడకూడదని సందీప్ రెడ్డి వంగా కోరుకుంటున్నారు. అందువల్ల డేట్స్ అన్ని తన సినిమాకు మాత్రమే కేటాయించేలా మిగతా సినిమా షూటింగ్స్ ఫినిష్ చేసుకున్నాక 'స్పిరిట్' స్టార్ట్ చేద్దామని చెప్పారట.