అన్వేషించండి

Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?

Carmeni Selvam: క్రెడిట్ కార్డులు, ఈఎంఐ వంటివి కడుతున్న మిడిల్ క్లాస్ పీపుల్ ప్రజెంట్ ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి జనాల్లో కనువిప్పు కలిగించే సినిమా 'కార్మేని సెల్వం' అవుతుందని సముద్రఖని చెబుతున్నారు.

తెలుగు ప్రేక్షకుల ముందు దర్శకుడిగా రవితేజ 'శంభో శివ శంభో'తో అడుగు పెట్టారు సముద్రఖని (Samuthirakani). ఆ తర్వాత నాని 'జెండాపై కపిరాజు', పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' చేశారు. అయితే... దర్శకుడిగా కంటే నటుడిగా ఆయన పాపులర్. 'అల వైకుంఠపుమురములో', 'సర్కారు వారి పాట' సినిమాల్లో విలన్ రోల్స్ మాత్రమే కాదు... పలు సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'కార్మేని సెల్వం'. అందులో మిడిల్ క్లాస్ లైఫ్ కష్టాల గురించి డిస్కస్ చేశామన్నారు.  

Carmeni Selvam Release Date: ఏప్రిల్ 3న విడుదల అవుతున్న సినిమాల్లో 'కార్మేని సెల్వం' ఒకటి. ఇందులో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రధారులు. సముద్రఖని జంటగా లక్ష్మీ ప్రియా, కీలక పాత్రలో అభినయ నటించారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల అవుతోంది. ఇందులో మెయిన్ పాయింట్ మిడిల్ క్లాస్ కష్టాలు.

Also Read: Lakshmi Manchu: మార్పు కోసం లక్ష్మీ మంచు ప్రయత్నం... ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందాలని!

'కార్మేని సెల్వం' సినిమాలో మిడిల్ క్లాస్ భర్తగా, తండ్రిగా నటించారు సముద్రఖని. వృత్తిరీత్యా ఆయన క్యాబ్ డ్రైవర్. 'అప్పు చేస్తే పెద్దవాళ్ళం అవుతాం' అని మెరుగైన జీవితం కోసం అప్పులు చేస్తాడు. 'ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిగా బతకడం నేర్చుకోవాలి' అంటూ లేనిపోని హంగు ఆర్భాటాలు చేయడం మొదలు పెడతాడు. క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐ వంటి వాటిపై ఆధారపడతాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని అవి ఏం చేశాయి? అనేది సినిమాలో చూడాలి. 

Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

పాత్‌ వే ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చక్రి దర్శకత్వంలో 'కార్మేని సెల్వం' చిత్రాన్ని అరుణ్ రంగరాజులు నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలోకి రాబోతుంది. తెలుగు ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సముద్రఖని మాట్లాడుతూ... ''మనం జీవితాన్ని చూసే విధానాన్ని ఈ సినిమాలో డిఫరెంట్‌గా చూపించబోతున్నాం. రామ్ చక్రి మంచి కథను నా దగ్గరకు తీసుకు వచ్చారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంటుందీ సినిమా. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ లోన్ ఈఎంఐలను తక్కువ చేసుకోవాలనుకుంటారు. బరువులను తగ్గించుకుంటే మన కలలను సాకారం చేసుకోగలం'' అని చెప్పారు.

Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
Kiara Advani: మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్
మళ్ళీ తల్లి కాబోతున్న కియారా... సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన హీరోయిన్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget