అన్వేషించండి

Samudram Chittabbai Movie Song: వేడుకయ్యి నీలో - 'సముద్రం చిట్టబ్బాయి'లో పాటను విడుదల చేసిన ఆలీ

పంకజ్ శ్రీరంగం, దేవి శ్రీ జంటగా రూపొందుతున్న సినిమా 'సముద్రం చిట్టబ్బాయి'. ఈ సినిమాలో 'వేడుకయ్యి నీలో' పాటను ఆలీ విడుదల చేశారు.

పంకజ్ శ్రీరంగం (Pankaz Shrirangam) కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'సముద్రం చిట్టబ్బాయి' (Samudram Chittabbai Movie). ఇందులో దేవి శ్రీ కథానాయిక. ఈ సినిమాలో 'వేడుకయ్యి నీలో...' (Vedukayyi Neelo Song) పాటను ప్రముఖ హాస్య నటుడు ఆలీ విడుదల చేశారు.

''హాలో అండీ... టైటిల్ చూశారు కదా! 'సముద్రం చిట్టబ్బాయి'... ఆ అబ్బాయి ఈ అబ్బాయే (హీరోని చూపిస్తూ...)! దర్శకుడికి ఇది తొలి సినిమా. హీరో, అతను, నిర్మాత ఒక టీమ్ గా ఏర్పడి మంచి సినిమా చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల అవుతున్నాయి. పంకజ్ శ్రీరంగంను ఆదరించండి. ఆశీర్వదించండి'' అని ఆలీ తెలిపారు. 

గ్రామీణ నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా 'సముద్రం చిట్టబ్బాయి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిజాని అంజన్ సంగీతం అందిస్తున్నారు. 'వేడుకయ్యి నీలో...' పాటకు కె.ఎస్.వి. ప్రసాద్ సాహిత్యం అందించగా... సంతోష్ కుమార్ వర్మ, సత్య శ్రీ, ధవళ పూర్ణిమ, మధు కార్తీక్ ఆలపించారు. 

''వేడుకయ్యి నీలో... 
ఊపిరయ్య యదలో!
నువ్వే అంటూ ప్రాణం... 
చెబుతూ ఉంది సడిలో!
కలత చెందకుండా... 
కుదుట ఉన్న యదతో!
నిన్నే కోరినాను... 
ఉన్న ఒక్క మదితో!'' అంటూ చక్కటి సాహిత్యంతో సాగింది ఈ  మెలోడీ సాంగ్. హీరోయిన్ మీద తన ప్రేమను హీరో చక్కగా వ్యక్తం చేశారు. 

విశాఖ, తుని మధ్యలో గల బొడ్డవరం గ్రామంలో 'సముద్రం చిట్టబ్బాయి' చిత్రీకరణ చేశారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు, స్నేహితుల మధ్య సరదా సన్నివేశాలతో సినిమా రూపొందుతోంది. ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్ అని తెలిసింది.

Also Read: 'హైపర్' ఆదిని అరెస్ట్ చేసిన పోలీసులు

మిర్యాల శివను దర్శకుడిగా పరిచయం చేస్తూ... సాయి గాయత్రి తనయ్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ ఫణి కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనకూ ఇదే తొలి సినిమా. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన పంకజ్ శ్రీరంగం, దేవి శ్రీకి హీరో హీరోయిన్లగా ఇదే తొలి సినిమా. ఇందులో రాజారాం దిల్లీ, శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు.

Also Read: శర్వానంద్ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు ప్రియమణి కూడా - అసలు కథ ఏంటంటే?

View this post on Instagram
 
A post shared by Aditya Music (@adityamusicindia)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Embed widget