Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
సమంత ఆరోగ్య పరిస్థితి, సినిమా షూటింగుల విషయంలో బోలెడు పుకార్లు షికారు చేస్తున్నాయి. లేటెస్టుగా ఆమె గురించి ఓ వచ్చిన ఓ ప్రచారాన్ని దర్శకుడు శివ నిర్వాణ ఖండించారు. సమంతకు అండగా ట్వీట్ వేశారు.

సమంత (Samantha)ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేస్తారు? తెలుసుకోవాలని కొన్ని రోజుల క్రితం వరకు ఆమె అభిమానులతో పాటు పరిశ్రమ ప్రముఖులు కూడా చూశారు. ఆ అవసరం ఇప్పుడు లేదు! ఎందుకు అంటే... సమంత సెట్స్‌కు వెళ్ళారు. హిందీ సినిమా 'సిటాడెల్' షూటింగ్ స్టార్ట్ చేశారు. అందులో వరుణ్ ధావన్ హీరో. దాంతో ఇప్పుడు కొత్త ప్రశ్న మొదలైంది.
విజయ్ దేవరకొండ 'ఖుషి' ఎప్పుడు?
హిందీలో 'సిటాడెల్'తో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' (Kushi Movie) సినిమా కూడా చేస్తున్నారు. 'నిన్ను కోరి', 'మజిలీ', 'టక్ జగదీష్' తర్వాత శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కశ్మీర్‌లో ఓ షెడ్యూల్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు షూట్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత సమంత అనారోగ్యం బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు. దాంతో మళ్ళీ సమంత సెట్స్‌కు వచ్చేది ఎప్పుడు? అంటూ యూనిట్ ఎదురు చూస్తోంది.
సమంత వస్తే షూటింగ్ స్టార్ట్ చేయడానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు సినిమా యూనిట్ మొత్తం సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఓ పుకారు వచ్చింది. దాని సారాంశం ఏంటంటే... మార్చి తొలి వారానికి కూడా 'ఖుషి' సెట్స్‌కు సమంత రాకపోతే మరో సినిమా చేయాలని దర్శకుడు శివ నిర్వాణ ఆలోచిస్తున్నారట. దీన్ని ఆయన ఖండించారు.
త్వరలో సెట్స్‌కు 'ఖుషి'
''అతి త్వరలో 'ఖుషి' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ అందంగా ఉండబోతుంది'' అని ఆయన పేర్కొన్నారు. దాంతో పుకార్లకు చెక్ పడింది.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
#khushi regular shoot will start very soon 👍
— Shiva Nirvana (@ShivaNirvana) January 30, 2023
everything is going to be beautiful❤️
ఈ వేసవిలో 'ఖుషి' వస్తుందా?
'ఖుషి' సినిమాను తొలుత గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎందుకు? అనేది ప్రేక్షకులు అందరికీ తెలుసు. అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరగలేదు. సమంతతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా 'లైగర్' చిత్రీకరణలో గాయాలు కావడంతో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్స్ జరిగాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో విడుదల అయ్యే ప్రస్తక్తి లేదు. వేసవికి విడుదల కావచ్చని టాక్. అప్పటికి అయినా వస్తుందో? లేదో? వెయిట్ అండ్ సీ.
Also Read : ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

