By: ABP Desam | Updated at : 30 Jan 2023 08:18 PM (IST)
Edited By: anjibabuchittimalla
Images Credit: Instagram and Twitter
కొత్త సంవత్సరం(2023) తొలి నెల సంక్రాంతి సినిమాల సందడితో కంప్లీట్ అయ్యింది. జనవరి చివరి వారం షారుఖ్ ‘పఠాన్’ మూవీతో బాక్సాఫీస్ దద్దరిల్లింది. ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఫిబ్రవరిలో కొత్త సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఇంతకీ ఈ వారంలో థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కాబోయే సినిమాలేంటో చూసేయండి మరి.
సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయ కోడి తెరకెక్కిస్తున్న సినిమా ‘మైఖేల్’. ఇందులో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, గౌతమ్ మేనన్, దివ్యాంశ కౌశిక్, అనసూయ, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సి.ఎస్ సంగీతం అందిస్తుండగా శివ చెర్రీ, భరత్ చౌదరి, పుష్కర్ మోహన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ సినిమా విడుదల కానుంది.
సుహాస్, టినా శిల్ప రాజ్ హీరో హీరోయిన్లుగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా తెరకెక్కింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనురాగ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆషిశ్ విద్యార్థి, గౌరీ ప్రియ, రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది.
పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద కీలక పాత్రలు పోషించిన సినిమా ‘సువర్ణ సుందరి’. సురేంద్ర మాచారపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్.ఎల్.లక్ష్మి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
త్రిగుణ్, మేఘా ఆకాశ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ప్రేమదేశం. మాయ ప్రీతి, అజయ్ కథుర్వార్, శివకుమార్, మధు షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు దర్శకుడే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు టి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం
ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
సోనీలివ్
జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) - ఫిబ్రవరి 3
ఆహా
అన్‌స్టాపబుల్ విత్ ఎన్ బీ కే (టాక్ షో పవన్ కల్యాణ్ ఎపిసోడ్-1) - ఫిబ్రవరి 3
డిస్నీ+హాట్‌స్టార్
1. బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) - ఫిబ్రవరి 1
2. సెంబి (తమిళం) - ఫిబ్రవరి 3
నెట్‌ఫ్లిక్స్
1. పమీలా (హాలీవుడ్) - జనవరి 31
2. గంతర్స్ మిలియన్స్ (వెబ్‌సిరీస్) - ఫిబ్రవరి 1
3. క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1) - ఫిబ్రవరి 3
4. ట్రూ స్పిరిట్ - ఫిబ్రవరి 3
5. ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్) - ఫిబ్రవరి 3
6. స్ట్రామ్ బాయిల్ - ఫిబ్రవరి 3
7. వైకింగ్ ఊల్ఫ్ - ఫిబ్రవరి 3
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా
Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక
డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత
'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది
మాధురీ దీక్షిత్‌పై అసభ్య వ్యాఖ్యలు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగల్ నోటీసులు జారీ
పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
Modi Flexis on Flyover: హైదరాబాద్ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు
మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు