Samantha: నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత ఫస్ట్ పోస్ట్ - సెల్ఫీతో గట్టి కౌంటరిచ్చిన సామ్!
Samanatha Selfie Post: మాజీ భర్త నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత ఫస్ట్‌టైం పోస్ట్ షేర్ చేసింది. సెల్పీ ఫోటో షేర్ చేస్తూ తనపై వస్తున్న వార్తలకు, రూమర్లకు సైలెంట్‌గా కౌంటర్ ఇచ్చింది.
Samantha Shared First Post After Naga Chaitanya Engagement: అక్కినేని హీరో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత ఫస్ట్ ఓ పోస్ట్ షేర్ చేసింది. గత వారం రోజులుగా సమంత హాట్‌టాపిక్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన సమంత ఆమె మాజీ భర్త నాగ చైతన్య గురించే చర్చ జరుగుతుంది. దీనికి కారణం నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థం. ఆగస్టు 8న చై తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభితను రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చాడు. ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
దీనితో సమంత కూడా వార్తల్లోకి ఎక్కింది. మాజీ భర్త నాగ చైతన్య నిశ్చితార్థం తర్వాత ఆమె ఎలా స్పందిస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురూ చూస్తున్నారు. మరోవైపు సమంతపై రకరకాల పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఆమె బాలీవుడ్ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇలా కొద్ది రోజులుగా సమంత పేరు మీడియా, సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఈ నేపథ్యంలో సామ్ ఒక్క పోస్ట్‌తో తనపై వస్తున్న రూమర్స్‌కి సమాధానం ఇచ్చింది. ఈ మేరకు సెల్ఫీ ఫోటో షేర్ చేస్తూ గాసిప్ రాయుళ్లకు కౌంటర్ ఇచ్చింది.
View this post on Instagram
తాజాగా సామ్ తన సెల్ఫీ లుక్ షేర్ చేసింది. అయితే దీనికి ఆమె ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. కానీ నవ్వుతూనే తనపై వస్తున్న రూమర్లకు కౌంటర్ ఇచ్చింది. సమంత టీ షర్టుపై ఓ కోట్ ఉంది. "The Musuem Of Peace and Quiet" అని రాసింది. దాని అర్థం "శాంతి, నిశ్చబ్ధలా మ్యూజియం" అని అర్థం. ఈ సెల్ఫీకి ఫోటోకు Now we are Free అనే ఇంగ్లిష్ సాంగ్‌ను జోడించింది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మాజీ భర్త నాగ చైతన్య నిశ్చితార్థం, తన డేటింగ్ రూమర్స్‌పై సామ్ ఎలా స్పందిందా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సైలెంట్‌గా తనపై వస్తున్న రూమర్లకు సామ్ ఇలా చెక్ పెట్టిందంటున్నారు. అంతేకాదు గాసిప్ రాయుళ్లకు తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చిందంటున్నారు. కాగా చై ఎంగేజ్‌మెంట్ తర్వాత సమంత సేర్ చేసిన ఫస్ట్ పోస్ట్ ఇదే కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం 'సిటాడెల్: హనీ అండ్ బన్నీ' వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. త్వరలోనే ఇది ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ డైరెక్టర్లో రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ తెగ ప్రచారం జరుగుతంది. ముఖ్యంగా బాలీవుడ్ మీడియాల్లో వీరిద్దరి రిలేషన్‌పై వరుసగా కథనాలు వెలువడుతున్నాయి. సమంత కోసం రాజ్ నిడిమోరు ఆయన భార్యకు విడాకులు ఇవ్వబోతుండానే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే ఆ డైరెక్టర్‌తో నిశ్చితార్థం కూడా జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ ఒక్క సెల్ఫీ పోస్ట్‌తో వీటన్నింటికి పరోక్షంగా సమాధానం ఇచ్చిందంటున్నారు.
Also Read: మెల్‌బోర్న్ చేరుకున్న రామ్ చరణ్ - ఆయనను చూసేందుకు పోటేత్తిన జనం, వీడియో వైరల్