అన్వేషించండి

Samanytha: 'ఊ అంటావా' పాట చేసేటప్పుడు భయంతో వణికిపోయాను - అసౌకర్యంగా అనిపించింది, మళ్లీ అలాంటి పాటలు అసలు చేయను

Samantha Comments: ఊ అంటావా పాట చేసేటప్పుడు భయంతో వణికిపోయాను. అప్పుడు అసౌకర్యానికి గురయ్యా.. ఎందుకంటే సెక్సీ అనే పదం నాకు సరిపడదు..

Samantha About Oo Antava Song: స్టార్‌ హీరోయిన్‌ సమంత రీఎంట్రీకి రెడీ అయిన సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ వ్యాధి చికిత్స కోసం లాంగ్ బ్రేక్‌ తీసుకున్న మళ్లీ యాక్టింగ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో సమంత ఇండియా టూడే కాన్‌క్లేవ్‌కి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్‌ విషయాలపై నోరు విప్పింది. ఈ సందర్భంగా ఆమె నటించిన తొలి ఐటెం సాంగ్‌ ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావా పాట టైం ఆమె ఎదురైన అనుభవాలను వెల్లడించింది. ఈ పాట షూటింగ్‌ టైంలో తాను వణికిపోయాంటూ షాకింగ్‌ విషయం రివీల్‌ చేసింది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "ఊ అంటావా పాట ఫస్ట్‌ షాట్‌ చేసేటప్పుడు భయపడ్డాను. ఎందుకంటే సెక్సీ అనే పదం నాకు పడదు. దాంతో ఫస్ట్‌ షాట్‌ చేసేటప్పుడు నా బాడీ వణికిపోయింది. నా వరకు ఊ అంటావా పాట, ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర ఒకటే. కానీ ఈ రెండు నా సొంత నిర్ణయంతోనే చేశాను. ఎందుకంటే కొత్త తరహా ఎవరి ఇన్‌ఫ్లూయేన్స్‌ నా మీద లేదు. కానీ, ఇందులో లైంగికతతో నేను అసౌకర్యంగా అనిపించినా, నేను చేయగలను అనే నమ్మకం లేకపోయినా చేశాను. ఎందుకంటే కొత్త తరహా నటన పరిచయం చేయాలని, నటిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాలనే 'ఊ అంటావా మావా' పాట చేశాను" అంటూ చెప్పుకొచ్చింది.

అయితే భవిష్యత్తులో అలాంటి పాటలు మళ్లీ చేస్తారా? అని ప్రశ్నించగా చేయనని తేల్చేసింది. ఈ పాటలోనే లిరిక్స్‌ తనకు ఛాలెంజింగా అనిపించాయని, సెక్సీ అనే పదం తనకు సరిపడదని పేర్కొంది. కాగా'పుష్ప: ది రైజ్‌'మూవీ వచ్చి రెండేళ్లు దాటింది. 2021 డిసెంబర్‌ 17న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. పాటలు అయితే ఓ రేంజ్‌లో మారుమోగాయి. ప్రపంచవ్యాప్తంగా పుష్ప పాటలకు విపరీతమైన బజ్‌ వచ్చింది. ముఖ్యంగా సమంత ఊ అంటావా పాటల అయితే ఇంటర్నేషన్‌ స్టేజ్‌పై కూడా ప్రదర్శించబడ్డాయి. అంతటి విజయం సాధించింది. అయితే సమంత వల్లే ఈ సాంగ్‌ అంత విజయం సాధించిందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్టార్‌ హీరోయిన్‌ అయిన ఆమె ఐటెం సాంగ్‌ నటించడంతోనే ఈ పాటపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక ఈ సాంగ్‌ రిలీజ్‌ అయినప్పుడు సమంతను దారుణంగా ట్రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోయిన్‌ అయిన ఆమె ఇలాంటి పాట చేయడం అవసరమా? అంటూ ఆమెను విమర్శించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇక తన వ్యాధి గురించి తప్పనిసరి పరిస్థితుల్లో బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. తన బయట కనిపించకపోవడం ఎన్నో పుకార్లు, తప్పుడు ప్రచారం చేశారు.. వాటికి చెక్‌ పెట్టేందుకే తన వ్యాధి గురించి చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆ టైంలో తన ఫీమేల్‌ ఒరియంటెడ్‌ చిత్రాల ప్రమోషన్‌ ఉందని, తను తప్పనిసరిగా ప్రమోషన్స్‌కి అటెండ్‌ అవ్వాలని డైరెక్టర్‌, నిర్మాతలు చెప్పారంది. లేదంటే సినిమా ప్లాప్‌ అయ్యే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో తాను హై డోస్‌లో మెడికేషన్‌లో ఉన్నానంది. అందుకే తన మయోసైటిస్‌ వ్యాధిని బయటపెట్టానంది, కానీ అంత నన్ను సింపతి డ్రామా ప్లే చేస్తుందన్నారు. సింపతి క్వీన్‌ అంటూ పిలిచారంటూ సమంత వాపోయింది.

Also Read: ఎన్నికల వేళ పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ - 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' నుంచి త్వరలో ఊహించని అప్‌డేట్‌..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget