అన్వేషించండి

Samantha: అప్పుడు చాలా కష్టంగా గడిచింది - సమంత కామెంట్స్‌.. తన విడాకుల గురించేనా?

Samantha: తాజాగా చాలామందికి తెలియని అనారోగ్య సమస్యలపై వారికి అవగాహన కల్పించడం కోసం సమంత ఒక పోడ్కాస్ట్‌ను ప్రారంభించింది. అందులో విడాకుల గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది.

Samantha: సీనియర్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లిని వారి కుటుంబాలతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరి జంట చాలా బాగుందంటూ మురిసిపోయారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు వారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పటికీ చర్చించుకుంటున్నారు. తాజాగా నాగచైతన్యతో విడిపోవడంపై సమంత మరోసారి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. విడాకుల గురించి ప్రకటించిన తర్వాత తన జీవితం ఎంత కష్టంగా సాగిందో చెప్పుకొచ్చింది.

అంతలోనే ఈ కండీషన్..

సమంత.. తాజాగా అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించే ఒక పొడ్కాస్ట్‌ను ప్రారంభించింది. అందులో తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. తాజాగా నాగచైతన్యతో విడాకులపై స్పందించింది సామ్. ‘‘నాకు బాగా గుర్తుంది. నాకు ఈ సమస్య రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు చాలా కష్టంగా గడిచింది. నేను నా మ్యానేజర్ హిమాంక్‌తో ముంబాయ్ నుండి ప్రయాణిస్తున్న సమయంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని తనతో చెప్పాను. చాలాకాలంగా నేను ఇంత ప్రశాంతంగా లేనని కూడా అన్నాను. ఫైనల్‌గా నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను, తృప్తిగా నిద్రపోగలుగుతున్నాను, లేచి నా పనిపైన దృష్టి పెట్టగలుగుతున్నాను, పనిని సరిగ్గా చేయగలుగుతున్నాను అని అనిపించేలోపు నాకు ఈ కండీషన్ ఉందని తెలిసింది’’ అంటూ సమంత రివీల్ చేసింది. అయితే, ఏడాది కిందట సమంత, చైతన్య విడాకులు ప్రకటించారు. దీంతో దాన్ని ఉద్దేశించే సామ్ కష్టంగా గడిచిందని చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా.. పదే పదే తన విడాకుల ప్రస్తావన తీసుకొచ్చి అక్కినేని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం బాగోలేదని పలువురు అంటున్నారు.

బలమైన కారణం ఉంది..

‘‘నేను ఈ పోడ్కాస్ట్ చేయాలి అనుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఆటో ఇమ్యూన్ కండీషన్ అనేది జీవితాంతం ఉంటుందని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇది చాలా బాధ కలిగించే అనుభవం. అందుకే ఈ ఆటో ఇమ్యూన్ గురించి, నేను ఎదుర్కుంటున్న సమస్యల గురించి అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నాను. తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్తగా ఉండడం మంచిది. 2021లో నాగచైతన్యతో విడాకుల గురించి ప్రకటించిన తర్వాత 2022లో తనకు ఉన్న మయాసైటీస్ గురించి ఫ్యాన్స్‌తో పంచుకుంది సామ్. దాని వల్ల పలుమార్లు తను సినిమాలకు బ్రేక్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా తన చేతిలో ఒక హాలీవుడ్ మూవీ ఉన్నా.. ఇంకేమీ కొత్త ప్రాజెక్ట్స్‌ను సైన్ చేయడం లేదు.

అవగాహన కోసం..

ఎప్పటికప్పుడు తన మాయసైటీస్ గురించి ఫాలోవర్స్‌తో పంచుకుంటూ వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంది సమంత. ఇప్పుడు ఏకంగా తన యూట్యూబ్ ఛానెల్‌లో పోడ్కాస్ట్‌ను ప్రారంభించి మరికొంత మంది ఇలాంటి ఆటో ఇమ్యూన్‌తో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యల గురించి చెప్పాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే తాజాగా తన మొదటి పోడ్కాస్ట్‌ను విడుదల చేసింది. అందులో నాగచైతన్యతో విడాకుల గురించి పరోక్షంగా సామ్ చేసిన వ్యాఖ్యలు అంతటా వైరల్ అవుతున్నాయి. తన పర్సనల్ లైఫ్ గురించి ఇంకేమైనా షేర్ చేసుకుంటుందేమో అన్న ఉద్దేశ్యంతో చాలామంది ఫ్యాన్స్ సామ్ పోడ్కాస్ట్‌ను ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు.

Also Read: ఆ హీరో వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే, బచ్చాగాడిననే అలా చేశారు: విశ్వక్ సేన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget