అన్వేషించండి

Samantha: రానా నా బ్రదర్... కొండా సురేఖకు సమంత ఇన్ డైరెక్ట్ కౌంటర్?

Jigra Pre Release Event Hyderabad: అక్కినేని కుటుంబానికి, తనకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన కొండ సురేఖ వ్యాఖ్యలకు 'జిగ్రా' ఈవెంట్‌లో సమంత ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారా? అసలు విషయం ఏమిటి?

రానా దగ్గుబాటి (Rana Daggubati)కి సమంత (Samantha Ruth Prabhu) ఏం అవుతారు? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమిటి? అంటే...  అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)కు రానా బావ కనుక సామ్ అతనికి సిస్టర్ వరుస. మరి, ఇప్పుడు సమంత అక్కినేని మాజీ కోడలు కాదు కనుక వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేదని, ఎటువంటి అనుబంధం లేదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అక్కినేని ఫ్యామిలీని కార్నర్ చేయాలని సమంతను వాడుకోవాలని చూస్తే కష్టమే! విడాకులు అయినా సరే మాజీ అత్తింటిపై సమంతకు గౌరవం ఉంది. 'జిగ్రా' వేడుకగా అది మరొకసారి బయట పడింది. 

రానా నా బ్రదర్... సమంత వ్యాఖ్యల వెనుక?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైన ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'జిగ్రా' (Jigra Movie). అక్టోబర్ 11న తెలుగులో కూడా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సమంత వచ్చారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న రానా దగ్గుబాటి తన బ్రదర్ అని పేర్కొన్నారు.

నాగ చైతన్యతో సమంత విడాకులకు కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. కానీ, చాలా మంది రకరకాల పుకార్లు ప్రచారం చేశారు. విడాకుల తర్వాత అక్కినేని  కుటుంబ సభ్యులతో, బంధువులతో గొడవలు అనేది అందులో ఒకటి. అక్కినేనితో బంధుత్వం ఉన్న అందరికీ సమంత దూరం అవుతారని ఒకానొక దశలో ప్రచారం జరిగింది. అయితే... ఇటీవల కొండా సురేఖ ఒక అడుగు ముందుకు వేసి నాగార్జున, నాగ చైతన్యను కించపరిచే విధంగా మాట్లాడారు. తన విడాకులకు, రాజకీయాలకు సంబంధం లేదని సమంత అప్పుడే స్పష్టం చేశారు. ఇప్పుడు 'జిగ్రా' వేడుకలో మాట్లాడిన మాటలు కొండా సురేఖకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

అక్కినేని నాగ చైతన్యతో విడాకులు అయినా సరే రానా తనకు అన్నయ్య అని చెప్పడంతో పాటు ఈవెంట్ అంతా సమంత నవ్వుతూ కనిపించారు. కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల అక్కినేని కుటుంబంతో, బంధువులతో తన బంధంతో ఎటువంటి మార్పు రాదనీ చెప్పకనే చెప్పారని అంటున్నారు.

Also Read: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్


ప్రతి అమ్మాయి తన కథలో తానే హీరో అని గుర్తు చేయాల్సిన బాధ్యత తమపై ఉంటుందని చెప్పడం వెనుక కూడా లోతైన అర్థం ఉందనేది విశ్లేషకుల మాట. ఆలియా భట్ కూడా సమంత ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ హీరో అని చెప్పడం వెనుక రీసెంట్ ఇష్యూస్ ఉన్నాయని... ఏం జరిగిందో తెలుసుకుని, సమంత ధైర్యంగా సమాధానం ఇచ్చిన విషయాన్ని అలియా ఆ విధంగా గుర్తు చేశారని అంటున్నారు.

కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కోర్టుకు  హాజరు అయ్యి అక్కినేని నాగార్జున తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అదే రోజు మరొక వేడుకలో కొండా సురేఖకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ అన్నట్లు సమంత మాట్లాడారు. దీని మీద సురేఖ అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: మొన్న చుట్టమల్లె... ఇప్పుడు 'ఊ అంటావా మావ' - తెలుగులో ఆలియా భట్ పాట కేక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
CSIR UGC NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
Embed widget