By: ABP Desam | Updated at : 26 Feb 2023 08:21 PM (IST)
Edited By: Raj
Image Credit: Samantha/Twittwer
దక్షిణాది అగ్ర కథనాయికలలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన నటనా నైపుణ్యం ఆమె సొంతం. 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సామ్.. జెస్సీగా తెలుగు ప్రేక్షకులని మాయ చేసింది. ఈ క్లాసిక్ మూవీ 2009 ఫిబ్రవరి 26న విడుదలైంది. నేటితో ఇండస్ట్రీలో 13 ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్న సమంత సినీ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం!
'ఏమాయ చేసావే' సినిమా మంచి విజయం సాధించడంతో, క్రేజీ ఆఫర్లు సమంత ఇంటి తలుపు తట్టాయి. ఈ క్రమంలో స్టార్ హీరోలందరితో నటించి, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తెలుగులోనే కాదు, తమిళంలోనూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా.. కథా బలమున్న చిత్రాలు, మహిళా ప్రాధాన్యత ఉన్న కథలని కూడా ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
వెండితెరపై హవా సాగించిన సామ్.. వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలో అడుగుపెట్టి, అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 సిరీస్ లో ఆమె రాజీ అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. 'పుష్ప' చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి ఓ ఊపు ఊపేసింది. ఇదే క్రమంలో 'యశోద' సినిమాతో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటింది.
ఈ పదమూడేళ్ళలో సమంత వ్యక్తిగత జీవితంలోనూ అనేక ఆటు పోట్లను చూసింది. తన ఫస్ట్ హీరో నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. నాలుగేళ్లు తిరక్కుండానే విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతోంది. అదే సమయంలో మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడింది. అయినా సరే మనో ధైర్యాన్ని కోల్పోకుండా, అన్ని సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతోంది.
సమంత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ చేశారు. #13PhenomenalYrsOfSamantha అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతూ, ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ చేశారు. ఈ నేపథ్యంలో సామ్ సైతం ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేసింది.
“నేను ఈ ప్రేమ అంతా నేను అనుభవిస్తున్నాను… అదే నన్ను ముందుకు నడిపిస్తుంది… ఇప్పుడూ, ఎప్పటికీ, నేను మీ వల్లనే ఇలా ఉన్నాను. 13 సంవత్సరాలు అయింది. మనం ఇప్పుడే ఆరంభిస్తున్నాం” అని సమంత తన ట్వీట్ లో పేర్కొంది.
I feel all of this love…
— Samantha (@Samanthaprabhu2) February 25, 2023
It is what keeps me going…
Now and forever, I am what I am because of you 🫶🏻
13 years and we are just getting started 💪🏼 https://t.co/eT1jwWnBCQ
ఇకపోతే సమంత ప్రస్తుతం 'శాకుంతలం' అనే పాన్ ఇండియా మూవీ విడుదల కోసం వేచి చూస్తోంది. అలానే విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. హిందీలో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంటర్నేషనల్ మూవీ కూడా ఆమె లైనప్ లో ఉంది.
Also Read: 13 ఏళ్ల కిందట సమంత ఇలా - అప్పటి ఫోటో షేర్ చేసిన రాహుల్ రవింద్రన్
Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!
Akshay Kumar: మూవీ షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!
Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి
Bhishma Combo Repeat: నితిన్, రష్మిక మూవీకి మెగాస్టార్ క్లాప్ - ‘భీష్మ’ త్రయంపై ఫ్యాన్స్ ఆశలు
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల