13 ఏళ్ల కిందట సమంత ఇలా - అప్పటి ఫోటో షేర్ చేసిన రాహుల్ రవింద్రన్
నటి సమంత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ ఓ స్పెషల్ పోస్ట్ తో ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు.
సినిమా ఇండస్ట్రీకు ఎంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రమే ప్రేక్షకులకు దగ్గరవుతారు. అలా ఇండస్ట్రీ లో ఓ సాధారణ నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నటి సమంత. తన అందం అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. సమంత సినిమాల్లోకి వచ్చి నేటికి సరిగ్గా 13 ఏళ్లు గడిచింది. సమంత నాగచైతన్య కలసి 2010 లో ‘ఏ మాయ చేశావే’ సినిమాలో నటించారు. సమంతకు ఇదే మొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో సమంత కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటి నుంచి సమంత వెనుదిరిగి చూసింది లేదు. కంటిన్యూ గా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అలా చూస్తుండగానే సమంత సినిమాల్లోకి 13 ఏళ్లు గడచిపోయాయి. దీంతో సమంతకు సోషల్ మీడియాలో శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సమంత స్నేహితుడు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ట్విట్టర్ ఖాతాలో సమంత గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
నటి సమంతకు రాహుల్ రవీంద్రన్ మంచి స్నేహితుడు. సమంత ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు రాహుల్. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. దాదాపు 14 సంవత్సరాల క్రితం తన ఇంటి టెర్రస్ పై తన సోదరుడు రోహిత్ రవీంద్రన్ సమంతను ఫోటో తీసాడు. ఇన్నేళ్ల తర్వాత ఆ విషయాన్ని గుర్తుచేస్తూ ఆ ఫోటోను షేర్ చేసుకున్నాడు రాహుల్. 13 ఏళ్ల సమంతకు అభినందనలూ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ఈ ఫోటో తీసి ఇన్నేళ్లు అయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సమంతకు విషెస్ చెబుతున్నారు.
కెరీర్ మొదట్లో సమంత ఎన్నో ఒడిదుడుకులనున ఎదుర్కొంది. నటన సరిగ్గా రాదని, డాన్స్, డైలాగ్స్ రావని కామెంట్స్ చేశారు. అయినా ఆమె వాటన్నిటినీ అధిగమించి సినిమాలు చేస్తూ వచ్చింది. క్రమేపి స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి ఇండియన్ లేడీ సూపర్ స్టార్ లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఇక సమంత ప్రేమ పెళ్లి గురించి అందరికీ తెలిసిందే. తన మొదటి సినిమాలో హీరో గా నటించిన నాగ చైతన్య తో చాలా సంవత్సరాలు ప్రేమలో ఉంది సమంత. తర్వాత వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తోంది. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంది సమంత. అందుకే ఆమె అంతటి క్రేజ్ సంపాదించుకుంది.
Look at this photo I found… @Rohit_Ravindran clicked it 14 years back on our terrace:) Congratulations on 13 years Sammy… here’s to many more decades 🥂😊 https://t.co/rlYoEvhMaG pic.twitter.com/RQ196MDeud
— Rahul Ravindran (@23_rahulr) February 26, 2023
ఇక ఇటీవల సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. కొన్నాళ్లు ఈ వ్యాధి వలన ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని మళ్లీ షూటింగ్ లకు సిద్దమయింది. తనకు ఆరోగ్యం సహకరించనపుడు కూడా సమంత తన సినిమాకు డబ్బింగ్ చెప్పింది. ఆ సమయంలో సమంత డెడికేషన్ కు అందరూ ప్రశంసించకుండా ఉండలేకపోయారు. గతేడాది ‘యశోద’ వంటి లేడిఓరియంట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి పలు సినిమాల్లో నటించింది సమంత.