రియా చక్రవర్తిపై సమంత ఆసక్తికర కామెంట్ - వైరల్‌గా మారిన పోస్ట్!
బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినీ పరిశ్రమలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడడం అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే అతని మరణం వెనుక స్నేహితురాలు రియా చక్రవర్తి హస్తం ఉందని సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిందన్న ఆరోపణలపై సుమారు ఆరువారాల పాటు రియాని జైల్లో ఉంచారు. సుశాంత్ జీవితాన్ని నాశనం చేసిందని రియా చక్రవర్తిపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. అరెస్ట్ తర్వాత కొన్నాళ్లకు బెయిల్‌పై బయటికి వచ్చింది. మూడు సంవత్సరాలుగా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న రియా చక్రవర్తి తాజాగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఈవెంట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా ఆ సమయంలో తన కుటుంబం, స్నేహితులు తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని తెలిపింది." నా బలం బలహీనత అంతా నా కుటుంబం నుంచి వచ్చింది. మా నాన్నగారు ఆర్మీలో ఉన్నందున మేం ఆర్మీ పెంపకంలో పెరిగాం. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చివరి వరకు పోరాడాలని మా నాన్నగారు చెబుతుండేవారు. ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు యుద్ధం చేసే సమయంలో మా చివరి నిమిషం వరకు పోరాడుతామని, నువ్వు కూడా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చివరి వరకు పోరాడాలని నాకెంతో ధైర్యం ఇచ్చారు. నేను కూడా అదే చేశాను. ఈ విషయంలో నా కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచింది. మా అమ్మా.. నాన్న మాత్రమే కాదు నా సోదరుడు, నా స్నేహితురాలు కూడా నాకెంతో సపోర్ట్ చేశారు. నా ఇతర స్నేహితుల్లో శివాని దండేకర్, అనిషా కూడా అండగా నిలిచారు. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తెలిసినవాళ్లు ఇలా చాలామంది ఉంటారు. కానీ మనకు ఓ కష్టం వచ్చినప్పుడు మనల్ని నమ్మి సపోర్ట్ చేసి మన వెనక నిలబడి ప్రేమించే వాళ్లు ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు మాత్రమే ఉంటారు" అంటూ చెప్పుకొచ్చింది రియా చక్రవర్తి.
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా రియా చక్రవర్తి మాట్లాడుతున్న ఈ వీడియో క్లిప్‌ని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేరకు సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియోని షేర్ చేస్తూ రియా చక్రవర్తిని 'హీరో' అనే క్యాప్షన్ తో ట్యాగ్ చేసింది. సమంత పోస్టుకు రియా స్పందిస్తూ.." రైట్ బ్యాక్ ఎట్' యు"(Right Back At you) అని రాసుకొచ్చించి. దీంతో ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. సమంతతో పాటు శివాని దండేకర్, హ్యుమా ఖురేసి, హన్సిక మోత్వాని లాంటి సెలబ్రిటీస్ సైతం ఈ వీడియో క్లిప్‌లో రియా ధైర్యాన్ని, నిజాయితీని మెచ్చుకున్నారు. ఇక రియా చక్రవర్తి కెరియర్ విషయానికొస్తే, ప్రస్తుతం MTV రోడిస్ అనే షోలో ఓ జడ్జిగా వ్యవహరిస్తోంది.
Also Read : ప్రభుత్వాలు సహకరించక పోయినా.. అఖండ రికార్డులు సృష్టించింది : బాలకృష్ణ