అన్వేషించండి
Advertisement
తండ్రిని కావాలని ఉంది - కానీ, మన చట్టాలు అందుకు ఒప్పుకోవు: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ తండ్రి కావాలని ప్లాన్ చేసుకున్నట్లు చెప్పాడు. తనకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పిన బాలీవుడ్ హీరో.. పెళ్లి కాకుండానే పిల్లలకు తండ్రి అవడానికి భారతీయ చట్టాలు అనుమతిస్తాయో లేదో అంటున్నాడు.
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. కండల వీరుడు సల్లూ భాయ్ 57 ఏళ్ల వయసు దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇంకా సింగిల్ గానే జీవితం గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు తనకు తండ్రి కావాలనే ఆలోచన ఉన్నట్లు నటుడు వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. తాను ఒకప్పుడు బిడ్డను కనాలని అనుకున్నానని, కానీ భారతదేశంలోని చట్టాల కారణంగా అలా చేయలేకపోయానని చెప్పాడు. అలానే పెళ్లి ప్లాన్స్ గురించి కూడా మాట్లాడాడు.
సల్మాన్ ఖాన్ కి చిన్న పిల్లలంటే అమితమైన ప్రేమ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడు సమయం దొరికినా తన మేనకోడళ్ళు, మేనల్లుళ్లతో సమయం గడుపుతుంటాడు. పిల్లలతో కలసి చిన్న పిల్లాడిలా ఆడుకుంటాడు. తన సోదరి అర్పితా ఖాన్ ఇద్దరు పిల్లలు, మరో చెల్లెలు అల్విరా ఖాన్ ఇద్దరు పిల్లలు, తమ్ముళ్లు సోహైల్ - అర్బాజ్ ల పిల్లలతో సల్మాన్ కలసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అయితే నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల కోసం ప్లాన్ చేయడం గురించి ఆయన మాట్లాడాడు.
"ఏం చెప్పాలి. మా ఇంటికి కోడలిని తీసుకురావడం కోసం కాదు, పిల్లల కోసం ప్లాన్ చేయాలని వుంది. కానీ భారతీయ చట్టాల ప్రకారం అది సాధ్యం కాదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం" అని సల్మాన్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా సరోగసీ విధానంలో దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇద్దరు పిల్లలకు తండ్రి కావడంపై కూడా సల్మాన్ స్పందించాడు.
"అదే నేనూ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ఆ చట్టం మారిపోయి ఉండొచ్చు. చూద్దాం, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కాకపొతే పిల్లలు వస్తే వాళ్ల అమ్మ కూడా వస్తుంది. పిల్లలకు తల్లి అవసరం ఉంటుంది. మన ఇంట్లో చాలా మంది తల్లులు ఉన్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు గ్రామం మొత్తం ఉంది" అని సల్మాన్ ఖాన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. సల్లూ భాయ్ పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించడం లేదు కానీ.. పిల్లలతో నాన్న అని పిలిపించుకోవాలని ఆరాట పడుతున్నాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.
కాగా, ఇన్నేళ్ల కెరీర్ లో అనేక మంది హీరోయిన్స్ తో సల్మాన్ ఖాన్ కు సంబంధాలు ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. 90వ దశకంలో సోమీ అలీతో, ఆ తర్వాత మోడల్ సంగీతా బిజ్లానీతో డేటింగ్ చేసినట్లు నివేదించబడింది. ఐశ్వర్య రాయ్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించి బ్రేకప్ చేసుకున్నాడని అప్పట్లో బీ టౌన్ కోడై కూసింది. ఇదే క్రమంలో కత్రినా కైఫ్ తో సల్మాన్ ప్రేమలో పడ్డట్లు నివేదికలు వచ్చాయి. అయితే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉన్న భాయిజాన్.. రొమేనియన్ మోడల్ లూలియా వంతూర్ తో డేటింగ్ లో ఉన్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇద్దరూ చాలా సందర్భాలలో కలిసి కనిపించడంతో త్వరలో పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఈ బంధం కూడా ముందుకి వెళ్ళలేదు.
ఇక సినిమాల విషయానికొస్తే. సల్మాన్ ఖాన్ ఇటీవల 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ తో పలకరించాడు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, విక్టరీ వెంకటేష్, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లను రాబడుతోంది. ఇకపోతే సల్మాన్ 'టైగర్ 3' స్పై యాక్షన్ థ్రిల్లర్ లో కత్రినా కైఫ్ తో కలసి నటిస్తున్నాడు. ఇది 2023 దీపావళి సందర్భంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion