Sriya Reddy About Animal : ‘యానిమల్’లో ఆ సీన్స్ నాకు నచ్చలేదు, ఆ ఛాన్స్ ఇస్తే చేస్తా: ‘సలార్’ బ్యూటీ శ్రీయా రెడ్డి
Sriya Reddy : ‘సలార్’ మూవీ ఫేమ్, తమిళ నటి శ్రీయా రెడ్డి తాజా ఇంటర్వ్యూలో ‘యానిమల్’ మూవీ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Salaar Actress Sriya Reddy About Animal Movie : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రణ్ బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విమర్శలు ఎదుర్కొంటూనే సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.
యువతను తప్పుదోవ పట్టించేలా ఈ సినిమా ఉందంటూ పలువురు సినీ విశ్లేషకులు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కానీ సందీప్ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే యానిమల్ సినిమాపై ఓ ఇంటర్వ్యూలో తమిళ నటి శ్రీయా రెడ్డి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ప్రభాస్ 'సలార్' మూవీలో కీలక పాత్ర పోషించిన శ్రీయా రెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇదే ఇంటర్వ్యూలో యానిమల్ ప్రస్తావన రాగానే సినిమా తనకు చాలా బాగా నచ్చిందని, కాకపోతే సినిమాలో తనకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పింది.
"యానిమల్ నాకు చాలా నచ్చింది. కానీ ఒక మహిళగా ఆ సినిమాలో నాకు చాలా ఇష్యుస్ ఉన్నాయి. కానీ వాటి గురించి నేను డిస్కస్ చేయలనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే ఎందుకు అలాంటి డిస్కషన్ రావాలి. ‘యానిమల్’ అనేది జస్ట్ ఒక సినిమా మాత్రమే. జనాలు అందరూ సినిమా చూస్తున్నారు. ఇష్టం లేకుంటే చూడరు. కాబట్టి అంత డిస్కషన్స్ అక్కర్లేదు కదా. కానీ మనం సినిమా చేస్తున్నామంటే మనకంటూ కొన్ని రెస్పాన్సిబులిటీస్ ఉంటాయి. ఆడియన్స్ సినిమాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. నాకు ఈ విషయంలో ఇష్యూ ఉంది. నేను చేసే క్యారెక్టర్స్ విషయంలో చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటాను. కొన్ని క్యారెక్టర్స్ ని నేను టచ్ కూడా చేయను. ‘యానిమల్’ విషయానికి వస్తే నాకు బాగా నచ్చడానికి కారణం సినిమా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. మనం కూడా ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు చేయాలి. కాబట్టి ఆ విధంగా చూస్తే ‘యానిమల్’ గుడ్ మూవీ. కానీ సినిమాలో కొన్ని పర్టికులర్ సీన్స్ విషయంలో నాకు మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. సినిమాలో ఉమెన్ క్యారెక్టర్ ని అలా ప్రజెంట్ చేయడం నాకు నచ్చలేదు" అని చెప్పింది.
ఒకవేళ మీకు సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్లు వచ్చి స్టోరీ చెప్తే సినిమా చేస్తారా? అని అడిగితే.. "నేను సందీప్ రెడ్డితో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నా. అతను ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్. ఒకవేళ నాకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తే సందీప్ వంగా నాకోసం ఎలాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేస్తారో చూడాలని నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చింది శ్రీయ రెడ్డి. దీంతో యానిమల్ మూవీపై శ్రీయా రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : భార్య వదిలేసిన మూవీకి ధనుష్ దర్శకత్వం - ‘DD3’ వెనుక అంత కథ ఉందా?