Saif Ali Khan: నా కుమారుడికి ఆదిపురుష్ చూపించా - ఎక్స్‌ప్రెషన్స్ చూసి సారీ చెప్పానన్న 'దేవర' విలన్
Adipurush: తన కుమారుడు తైమూర్‌కు ఆదిపురుష్ సినిమా చూపించి సారీ చెప్పినట్లు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ అన్నారు. సినిమా చూసి అతనిలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేవని తెలిపారు.

Saif Ali Khan About Adipurush Movie: 'ఆదిపురుష్' సినిమా చూపించి తన కుమారునికి సారీ చెప్పానని బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) అన్నారు. తాజాగా 'నెట్ ఫ్లిక్స్' (Netflix) ఇండియా యూట్యూబ్ ఛానల్‌లో 'జ్యుయెల్ థీఫ్' సహనటుడు జైదీప్ అహ్లావత్‌తో జరిగిన ఛాట్‌లో సైఫ్ మాట్లాడారు.
ఆదిపురుష్ చూపిస్తే.. రియాక్షన్ లేదు
'మీ పిల్లలు మీ సినిమాలు చూస్తారా?' అని అడిగిన ప్రశ్నకు సైఫ్ స్పందించారు. '3 గంటల నిడివి ఉన్న ఆదిపురుష్ సినిమాను నేను నా కుమారుడు తైమూర్‌కు చూపించాను. ఆ సినిమా చూసి వాడి నుంచి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేవు. కాసేపటి తర్వాత నన్ను అదోలా చూశాడు. ఆ చూపుతోనే నాకు అర్థమైంది. వెంటనే నేను తైమూర్‌కు సారీ చెప్పాను. ఇట్స్ ఓకేలే అంటూ నన్ను క్షమించేశాడు.' అంటూ సైఫ్ చెప్పారు.
నేను సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసినప్పుడు వాటిని తైమూర్ చూసి.. నువ్వసలు మంచివాడివా? లేక చెడ్డవాడివా అని నన్ను అడుగుతుంటాడని సైఫ్ అన్నారు.
ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం 'ఆదిపురుష్' (Adipurush). 2023లో రిలీజ్ అయిన ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, హేమమాలిని, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. మూవీలో కృతిసనన్ జానకిగా, సైఫ్ రావణుడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్, వీఎఫ్ఎక్స్‌పై ట్రోలింగ్ సాగింది. రావణుడిగా సైఫ్‌కు ముందు 5 తలలు, దానికి పైన 5 తలలు పెట్టడంపై విమర్శలు వచ్చాయి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: మలయాళ యాక్టర్ విష్ణుప్రసాద్ మృతి - లివర్ డొనేట్ చేసేందుకు కూతురు ముందుకొచ్చినా..
ఇక సినిమాల విషయానికొస్తే.. సైఫ్ అలీ ఖాన్ తాజాగా యాక్షన్ థ్రిల్లర్ 'జ్యుయెల్ థీఫ్' (Jewel Thief)లో నటించారు. ఏప్రిల్ 25 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీలో జైదీప్ అహ్లావత్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సైఫ్.. జానియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న 'దేవర 2'లోనూ ఆయన నటించనున్నారు.






















