Sai Pallavi: మళ్లీ తెరపైకి సాయి పల్లవి పాత వీడియో - ‘రామాయణ్’ను బాయ్‌కాట్ చేస్తామంటూ నెటిజన్స్ ఆగ్రహం
Sai Pallavi: ప్రస్తుతం సాయి పల్లవి.. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇదే సమయంలో కాంట్రవర్సీకి దారితీసిన సాయి పల్లవి పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Sai Pallavi Controversy: ఈరోజుల్లోని యంగ్ హీరోయిన్లలో చాలామంది అభిమానులను సంపాదించుకున్న వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. తను ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాకపోయినా, సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండకపోయినా.. తనను అభిమానించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అలాంటి సాయి పల్లవి సినిమా ప్రమోషన్స్‌లో తప్పా మిగతా సమయాల్లో బయట కనిపించదు. అలాగే కాంట్రవర్సీలకు కూడా చాలా దూరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం తను నితీష్ తివారీ ‘రామాయణ్’లో సీతగా నటిస్తుండగా.. తనకు సంబంధించిన ఒక పాత కాంట్రవర్షియల్ వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది.
అప్పట్లో..
సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ‘విరాటపర్వం’ మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అప్పుడు తనకు ఎదురైన ప్రశ్నకు తను ఇచ్చిన సమాధానం పెద్ద దుమారానికే దారితీసింది. ‘కశ్మీర్ ఫైల్స్’లో కశ్మీర్ పండితులను చంపడం గురించి చాలా బోల్డ్‌గా చూపించాడు దర్శకుడు. ఆ దానిపై సాయి పల్లవి స్పందించింది. ‘‘ఈమధ్య ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక ముస్లిం వ్యక్తి.. ఆటోలో ఒక ఆవును తీసుకెళ్తున్నాడు. హిందువులు ఆ ఆటోను ఆపి అతడిని కొట్టి జై శ్రీరామ్ అని అరిచారు’’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
ఉద్దేశ్యం అది కాదు..
‘కశ్మీర్ ఫైల్స్’లో కశ్మీర్ పండితులను చంపడాన్ని, ఆవును తీసుకెళ్తున్నందుకు ముస్లిం వ్యక్తిని కొట్టి జై శ్రీరామ్ అని అరిచిన సందర్భాన్ని సాయి పల్లవి పోలుస్తూ మాట్లాడింది. ఇది చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. అదీ ఇదీ ఒకటేనా అంటూ సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ సాయి పల్లవి తప్పు ఉద్దేశ్యంతో ఏ మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడలేదని, ఆ తర్వాత కొన్నిరోజులకే క్లారిటీ ఇచ్చింది. మనిషి వ్యక్తిగతంగా మంచివాడు అయితే చాలని, మధ్యలో మతంతో సంబంధం లేదని చెప్పడమే తన ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చింది. అంతా క్లియర్ అయిపోయిన ఇన్నాళ్లకు మళ్లీ ఆ కాంట్రవర్షియల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Killing a cow smuggler is the same as killing a Kashmiri Pandit” says actress Sai Pallavi. Comparing the targeted genocide of a community to the mafia trade of cow smuggling. She is playing Mata Sita role in an upcoming movie. pic.twitter.com/Bdta0mYTuv
— Professor Sahab (@ProfesorSahab) April 27, 2024
సినిమా చూడము..
ప్రస్తుతం సాయి పల్లవి.. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాయాయణ్’లో సీతగా నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్.. రాముడి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యి సెట్ నుండి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా ఒకప్పుడు సాయి పల్లవి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వైరల్ చేస్తూ కొందరు నెటిజన్లు ‘రామాయణ్’ను చూడమంటూ, బాయ్‌కాట్ చేస్తామంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. హిందువులపై ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చిన వ్యక్తి.. సీత పాత్ర చేయడమేంటి అంటూ కోప్పడుతున్నారు. మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read: అనుపమకు మరో తెలుగు సినిమా - 'రాక్షసుడు' హీరోతో ఈసారి రొమాన్స్!