Anupama Parameswaran: అనుపమకు మరో తెలుగు సినిమా - 'రాక్షసుడు' హీరోతో ఈసారి రొమాన్స్!
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తెలుగులో మరో సినిమాకు సంతకం చేశారని తెలిసింది. హిట్ కాంబోలో ఆవిడ సినిమా చేయబోతోంది. ఇంతకు ముందు క్యాజువల్ సీన్స్ ఉంటే... ఈసారి హీరోతో కొత్త సినిమాలో రొమాన్స్ చేస్తారట.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హవా నడుస్తోంది. కుర్రకారులో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకు ముందు లేదని కాదు... 'టిల్లు స్క్వేర్' సినిమా తర్వాత అనుపమ క్రేజ్ మరింత పెరిగింది అనేది వాస్తవం. దాంతో ఆమెకు వరస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... ఓ కొత్త సినిమాకు అనుపమ సంతకం చేసింది. ఆల్రెడీ నటించిన హీరోతో మరో సినిమా చేయబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
బెల్లంకొండకు జోడీగా అనుపమ!
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), అనుపమలది సూపర్ హిట్ జోడి. 'రాక్షసుడు'లో వాళ్ళిద్దరూ జంటగా నటించారు. ఇప్పుడు ఆ జంట మరోసారి వెండితెరపై కనువిందు చేయడానికి రెడీ అవుతోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా 'చావు కబురు చల్లగా' దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'రాక్షసుడు' సినిమాలో జంటగా నటించినప్పటికీ... బెల్లంకొండ అనుపమ మధ్య రొమాంటిక్ సీన్లు ఏమీ లేవు. ఈ సినిమాలో మాత్రం వాళ్ళిద్దరికీ లవ్ ట్రాక్, రొమాన్స్ వంటివి ఉంటాయని తెలిసింది. ఇద్దరూ కలిసి పాటల్లో స్టెప్పులు కూడా వేయనున్నారట.
Also Read: ఎన్టీఆర్‌ను చుట్టుముట్టిన ముంబై మీడియా... బాలీవుడ్ స్టార్లతో యంగ్ టైగర్ పార్టీ
బెల్లంకొండ సినిమాకు 'కిష్కింద పురి' టైటిల్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ దర్శకత్వం వహించనున్న సినిమా హారర్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని ఫిలిం నగర్ టాక్. ఈ చిత్రానికి 'కిష్కింద పురి' (Kishkindha Puri Movie) టైటిల్ ఖరారు చేశారట. కథలో వానరాలకు (కోతులకు) కూడా ఓ లింక్ ఉందట. అందుకని ఆ టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. హారర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాకు బాక్సాఫీస్ బరిలో మంచి ఆదరణ దక్కడం ఖాయమని యూనిట్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
Also Read: ఓటీటీ సందడి... ఈ వారం వచ్చే వెబ్ సిరీస్, సినిమాలు ఏవో తెలుసా?
అనుపమ చేతిలో మరో మూడు సినిమాలు!
Anupama Parameswaran Upcoming Movies: 'టిల్లు స్క్వేర్' తర్వాత అనుపమ జోరు పెంచింది. వరుస సినిమాలకు సంతకాలు చేస్తోంది. తెలుగులో 'కిష్కింద పురి' కాకుండా సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో 'పరదా' సినిమా చేస్తోంది. మలయాళంలో సీనియర్ హీరో సురేష్ గోపి సినిమాలో కీలక పాత్ర పోషించడంతో పాటు 'ది పెట్ డిటెక్టివ్' అని మరో డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చేస్తోంది. తెలుగులో రెండు మూడు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని వాటి వివరాలు త్వరలో వెల్లడించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 'టిల్లు స్క్వేర్' సక్సెస్ అనుపమకు బాగా హెల్ప్ అవుతోంది. అయితే, ఆవిడ గ్లామర్ రోల్స్ కోసం కాకుండా డిఫరెంట్ రోల్స్ కోసం చూస్తున్నారట. కేవలం అందాల ప్రదర్శన ఉన్న క్యారెక్టర్లు చేయడానికి అంత ఆసక్తి చూపించడం లేదని గుసగుస.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

