Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్... లేడీ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ ఇచ్చిన గిఫ్ట్ చూడండి
Sai Pallavi Special Birthday Video: సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా 'తండేల్' మూవీ టీం ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. అందులో ఏముంది? మిగతా వివరాలు ఏమిటి? అనేది చూడండి.
Thandel movie team wishes Sai Pallavi with special video on her birthday: సాయి పల్లవి... ఈ కథానాయికకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెను కథానాయికగా కంటే, ఓ అందాల భామగా కంటే నటిగా చూసే ప్రేక్షకులు ఎక్కువ. వ్యక్తిగత జీవితంలో ఆమె సింప్లిసిటీని ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువ. ఇవాళ సాయి పల్లవి బర్త్ డే. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ 'తండేల్' టీమ్ ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది.
సత్య పాత్రలో సాయి పల్లవి...
నాగ చైతన్యకు జోడీగా రెండోసారి!
Sai Pallavi Role In Thandel: 'తండేల్' సినిమాలో సాయి పల్లవి పాత్ర పేరు సత్య. ఇందులో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)కు జోడీగా ఆమె నటిస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఆల్రెడీ 'లవ్ స్టోరీ' చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఓ వీడియోలో సముద్ర తీరంలో సాయి పల్లవి అలా అలా నడుస్తూ నవ్వుతున్న దృశ్యాలు చూపించారు. పుట్టినరోజు కనుక మరింత స్పెషల్ అనేలా మరో వీడియో విడుదల చేశారు. అది ఎలా ఉందో మీరే చూడండి.
Also Read: ఆ బిరుదు అందుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ - నిజంగా.. సాయి పల్లవి 'హైబ్రిడ్ పిల్లే'!
You act. We celebrate.
— Geetha Arts (@GeethaArts) May 9, 2024
You perform. We cherish.
Happy Birthday 'Bujji Thalli' aka @Sai_Pallavi92 👑🫰🏻
On your special day here's a special gift from team #Thandel ⚓▶️ https://t.co/ZmSoNdDTek#HBDSaiPallavi ❤
Yuvasamrat @chay_akkineni @chandoomondeti @ThisIsDSP pic.twitter.com/Hy1dWaCQD5
Thandel movie director and producer: 'తండేల్'కు చందూ మొండేటి డైరెక్టర్. పాన్ ఇండియన్ సెన్సేషనల్ హిట్ 'కార్తికేయ 2' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అంతే కాదు... 'ప్రేమమ్' వంటి లవ్లీ హిట్ తర్వాత తన అభిమాన హీరో నాగార్జున కుమారుడు చైతూతో చేస్తున్న సినిమా కూడా! మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై యువ నిర్మాత 'బన్నీ' వాసు ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
'తండేల్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ రూ. 40 కోట్లకు సొంతం చేసుకుంది. చైతూ కెరీర్ మొత్తం మీద హయ్యస్ట్ అమౌంట్ ఇది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొందరు మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. చేపల వేటకు వెళ్లిన కొందరు జాలరులు పాకిస్తాన్ అధికారుల చేతికి చిక్కుతారు. ఆ తర్వాత ఏమైందనేది సినిమా.
'తండేల్'లో హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సాయి పల్లవి... ఇద్దరూ డీ గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. చైతు తొలిసారి శ్రీకాకుళం యాస మాట్లాడుతూ తెరపై సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: శామ్ దత్, కళ: శ్రీ నాగేంద్ర తంగాల, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణం: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.