అన్వేషించండి

SDT 18: సాయి దుర్గా తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్, స్పెషల్ వీడియో ట్రీట్ అదుర్స్ అంతే!

సాయి దుర్గ తేజ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. SDT 18 మేకింగ్ కు సంబంధించి కళ్లు చెదిరే విజువల్ ట్రీట్ అందించారు. స్పెషల్ వీడియోతోనే మూవీపై భారీగా అంచనాలు పెంచారు.

SDT 18 Making Video: మెగా హీరో సాయి దుర్గ తేజ్ కాస్త గ్యాప్ మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రోహిత్ కె.పి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నారు. సాయి తేజ్ కెరీర్ లో 18వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను... ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్   భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీలో అందాల తార ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇవాళ సాయి దుర్గ తేజ్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.  

కళ్లు చెదిరేలా విజువల్ ట్రీట్

SDT18 మేకింగ్ వీడియో కళ్లు చెదిరే విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ కథాంశంతో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది. ‘ఆర్కాడీ ప్రపంచలోకి స్వాగతం...” అంటూ చూపించిన ఈ వీడియో ఆహా అనిపిస్తోంది. సాయి దుర్గ తేజ్ తొలిసారిగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఈ హై ఆక్టేన్, పీరియడ్ యాక్షన్ డ్రామాలో తన మార్క్ నటనతో ఆకట్టుకోబోతున్నది. ఈ సినిమాలో సాయి ఫిట్ నెస్ మరో లెవెల్ లో కనిపిస్తోంది. ఈ మూవీ కోసం ఆయన తన బాడీని మరింతగా పెంచుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ వీడియో జస్ట్ బిగినింగ్ అంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు సినిమా మరెలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఈ మేకింగ్ వీడియో ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచుతోంది.    

పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న SDT18

అటు ‘విరూపాక్ష’, ‘బ్రో’ లాంటి హిట్ చిత్రాలతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్న సాయి దుర్గ తేజ్ ఇప్పుడు SDT18 అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమానూ తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్‌  సంస్థపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో భాషల్లో విడుదలకానుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

యాక్సిడెంట్ తర్వాత రెండు హిట్ చిత్రాలు

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి మీద బైక్ స్కిడ్ అయి కోమాలోకి వెళ్లిన సాయి దుర్గ తేజ్ కొద్ది రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. కొద్ది కాలం పాటు రెస్ట్ తీసుకున్న ఆయన, ‘విరూపాక్ష’ సినిమా చేశారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే ఊపులో మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం SDT18 అనే ప్రతిష్టాత్మక చిత్రంతో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
Telangana Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్  పరీక్ష
Telangana Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్ పరీక్ష
చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం.. మరో 24 గంటలు ఇంతే..
చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం.. మరో 24 గంటలు ఇంతే..
Telangana DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్- పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్- పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్‌ కెనడా మధ్య మరోసారి రాజుకున్న వివాదంSpaceX catches Starship booster with Chopsticks | Mechzilla తో రాకెట్ ను క్యాచ్ పట్టిన SpaceX | ABPNASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
Telangana Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్  పరీక్ష
Telangana Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్ పరీక్ష
చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం.. మరో 24 గంటలు ఇంతే..
చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం.. మరో 24 గంటలు ఇంతే..
Telangana DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్- పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్- పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
Maharashtra And Jharkhand Assembly Elections 2024: నేడే మహారాష్ట్ర, జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల నగారా - మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల నగారా - మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల
India-Canada Relations: ఆధారాలతోనే మాట్లాడుతున్నామంటూ భారత్‌పై మరోసారి విషం చిమ్మిన కెనడా
ఆధారాలతోనే మాట్లాడుతున్నామంటూ భారత్‌పై మరోసారి విషం చిమ్మిన కెనడా
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
Andhra Pradesh: ఫ్లెక్లీలపై ఫొటోల విషయంలో అధికారులకు పవన్ కీలక ఆదేశాలు
ఫ్లెక్లీలపై ఫొటోల విషయంలో అధికారులకు పవన్ కీలక ఆదేశాలు
Embed widget