By: ABP Desam | Updated at : 07 Dec 2022 11:07 AM (IST)
'విరూపాక్ష' సినిమాలో సాయి ధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'విరూపాక్ష' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు టైటిల్ వెల్లడించడంతో పాటు టైటిల్ గ్లింప్స్ (SDT 15 Title Glimpse) కూడా విడుదల చేశారు.
ఎన్టీఆర్ వాయిస్...
విజువల్స్ సూపర్!
NTR for SDT : 'విరూపాక్ష' టైటిల్ గ్లింప్స్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించిన విషయం ముందుగా తెలియజేశారు. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ చూస్తే... సాయి ధరమ్ తేజ్ పాత్రను తారక్ తన వాయిస్ ద్వారా పరిచయం చేసిన తీరు వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. విజువల్స్ కూడా బావున్నాయి.
''అజ్ఞానం భయానికి మూలం... భయం మూఢ నమ్మకానికి కారణం... ఆ నమ్మకమే నిజమైనప్పుడు? ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు? అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం'' అని ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత 'విరూపాక్ష' టైటిల్ రివీల్ చేశారు. విజువల్స్ థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ లుక్ రివీల్ చేశారు.
పాన్ ఇండియా రిలీజ్!
Virupaksha Release Date : 'విరూపాక్ష' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నేడు వెల్లడించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుకుమార్ కథతో...
ఆయన శిష్యుడు!
మిస్టరీ థ్రిల్లర్‌గా 'విరూపాక్ష' సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి సుకుమార్ కథనం అందించారు. హీరోగా సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా ఇది. అందుకని, ఇన్ని రోజులూ SDT 15 మూవీగా పేర్కొన్నారు.
తెలుగులో 'కాంతార' సంగీత దర్శకుడి రెండో చిత్రమిది!
B Ajaneesh Loknath Telugu Movies : బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార' (Kantara) కు ఆయన సంగీతం అందించారు. ఆ సినిమా విజయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషించిందో... మన అందరికీ తెలిసిందే. తెలుగులో అజనీష్‌కు రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'నన్ను దోచుకుందువంటే' చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో డబ్బింగ్ అయిన కన్నడ సినిమాలకు మ్యూజిక్ అందించారు (SDT 15 Music Director).
కథానాయికగా సంయుక్తా మీనన్!
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు 'భీమ్లా నాయక్'లో రానా దగ్గుబాటి జోడీగా నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాలో కూడా ఓ కథానాయికగా ఎస్సై పాత్రలో కనిపించారు.
Also Read : తెలుగులో ఈ ఏడాది (2022లో) రీమేక్ రాజాలు వీళ్ళే - హిట్టా? ఫట్టా?
సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి తేజ్‌కు రోడ్ యాక్సిడెంట్ కావడానికి ముందు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ ప్రమాదం వల్ల కొన్ని రోజులు బ్రేక్ పడింది. మళ్ళీ ఆయన కోలుకున్నాక షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి హైదరాబాద్‌లో రెండు సెట్స్ వేశారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం.
కొత్త సినిమా స్టార్ట్ చేసిన సాయి తేజ్!
ఈ సినిమా సెట్స్ మీద ఉండగా... చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పణ, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో సాయి తేజ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. గత శుక్రవారం ఆ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దాంతో జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
Pawan Kalyan As God : ప్రేమికుల రోజు నుంచి దేవుడిగా పవన్ కళ్యాణ్
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి