Sahiba Teaser: రౌడీ బాయ్ మ్యూజిక్ ఆల్బమ్ ప్రోమో వచ్చేసింది, ‘సాహిబా’ ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ ‘సాహిబా’ ప్రోమో విడుదలైంది. ఇందులో విజయ్ ఫోటోగ్రాఫర్ గా కనిపించారు. ఈ ఆల్బమ్ ఫుల్ సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
Vijay Deverakonda Sahiba Teaser: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రొటీన్ కు భిన్నంగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. ఈ సాంగ్ ను బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జస్లీన్ రాయల్ కంపోజ్ చేశారు. గత ఏడాది ‘హీరియే..’ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె... ఇప్పుడు ‘సాహిబా’ అనే కొత్త పాటను రూపొందించారు. ‘హీరియే’ సాంగ్ లో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా, ఈ పాటలో విజయ్ దేవరకొండ నటించారు. విజయ్ దేవరకొండకు జోడీగా రాధిక మదన్ కనిపించారు. వీరిద్దరు కలిసి నటించడం ఇదే తొలిసారి.
ఆకట్టుకుంటున్న ‘సాహిబా’ ప్రోమో
సుధాన్షు సరియా దర్శకత్వం వహించిన ‘సాహిబా’ మ్యూజిక్ ఆల్బమ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ‘మాటలకు అతీతంగా, కాలానికి మించి- ఒక ప్రేమకథ ఎదురుచూస్తోంది’ అంటూ ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ గా కనిపించారు. విజయ్, రాధిక మదన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటున్నది. తన సరికొత్త సంగీత శైలి, భావోద్వేగాలతో జస్లీన్ వీక్షకులను అలరించింది. ఈ పాట మ్యూజిక్ లవర్స్ మదిలో నిలిచిపోయేలా జస్లీన్ రూపొందించారు. ఈ వీడియో ఆల్బల్ ప్రారంభంలో దుల్కర్ సల్మాన్ కనిపించారు. ఓ యోధుడిగా దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నది.
ఈ నెల 15న ఫుల్ సాంగ్ విడుదల
‘సాహిబా’కు సంబంధించిన పూర్తి పాట ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు సంగీత ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ ఆల్బమ్ ‘హీరియే..’ సాంగ్ ను మించి హిట్ అవుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
వరుస సినిమాలతో విజయ్ ఫుల్ బిజీ
ఇక విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆయన నటించిన ‘లైగర్’,’ ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో కాస్త విరామం తీసుకున్న విజయ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చెప్తున్నారు. ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లోనూ ఓ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు హుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీలోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్ రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీపావళికి విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది.
Read Also: ప్రభాస్‌తో అలా... బన్నీతో ఇలా... పాయల్ అంత మాట అనేసిందేంటి?