Salaar: ఆ మూవీకి ‘సలార్’ రీమేక్? అసలు విషయం చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్
ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘సలార్’పై ఇప్పటికీ ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటి మరో రూమర్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుండగా.. దానికి ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చాడు.
ప్యాన్ ఇండియా స్టార్లు అయిన హీరోల సినిమాల గురించి ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమలో పలు పుకార్లు పుట్టుకురావడం సహజం. ఆ హీరో ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా కథ ఏంటి, దానికి సీక్వెల్ ఉంటుందా.. ఇలా ఎన్నో ప్రశ్నలు.. ప్రేక్షకులు మైండ్‌లో ఉండిపోతాయి. దానికి ఇదే సమాధానం అంటూ ఎవరో ఒకరు సృష్టించే రూమర్.. అంతటా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘సలార్’ పరిస్థితి కూడా ఇదే. త్వరలోనే విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ‘సలార్’ గురించి మరో పుకారు సినీ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తోంది.
‘సలార్’ పోస్ట్‌పోన్..
అసలైతే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’.. సెప్టెంబర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల మూవీ పోస్ట్‌పోన్ అవుతున్నట్టు టీమ్ ప్రకటించింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయినా.. మాకు ఇది అలవాటే అన్నట్టుగా లైట్ తీసుకున్నారు. ఇక ‘సలార్’ వచ్చేది వచ్చే ఏడాదే అని చాలామంది ఫిక్స్ అయిపోయారు కూడా. కానీ అనూహ్యంగా డిసెంబర్ 22న ‘సలార్’ రిలీజ్ అంటూ కొత్త విడుదల తేదీని ప్రేక్షకుల ముందు పెట్టింది మూవీ టీమ్. అంటే షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దున్‌కీ’తో ప్రభాస్ ‘సలార్’ పోటీపడనుంది. ఇలాంటి సమయంలోనే ‘సలార్’పై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేలాగా ఒక రూమర్ వైరల్ అయ్యింది.
మ్యూజిక్ డైరెక్టర్ క్లారిటీ..
ప్రశాంత్ నీల్ 2014లో ‘ఉగ్రం’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ కమర్షియల్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఒడియా, మరాఠీలాంటి భాషల్లో కూడా ఈ మూవీ రీమేక్ అయ్యింది. ఇప్పుడు ‘సలార్’ కూడా ‘ఉగ్రం’కు రీమేక్ అని వార్తలు వైరల్ అయ్యాయి. ‘ఉగ్రం’ అనేది కేవలం కన్నడలో తెరకెక్కింది. శ్రీమురళీ, హరిప్రియ, తిలక్ శేఖర్ ఈ మూవీలో లీడ్ రోల్స్‌లో కనిపించారు. అయితే కొన్నీళ్ల క్రితం ‘సలార్’ అనేది ‘ఉగ్రం’కు రీమేక్ అని వచ్చిన వార్తలను మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కూడా సమర్ధించారు. కానీ రవి బస్రూర్ చెప్పిన మాటలకు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్‌లోనే..
‘‘నేను చేసిన ప్రతీ సినిమాలో కొంచెం ఉగ్రం షేడ్స్ ఉంటాయి. కానీ సలార్ అనేది ఒక ఫ్రెష్ స్టోరీ. అది ఉగ్రంకు రీమేక్ కాదు’’ అని క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక ‘సలార్’ అనేది ‘ఉగ్రం’ రీమేక్ అన్న విషయం పక్కన పెడితే.. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్‌లోనే ‘సలార్’ కూడా ఒక భాగమని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రశాంత్ నీల్ ‘సలార్’లో కూడా ‘కేజీఎఫ్’ కథను జోడించడానికి ప్రయత్నించాడని టాక్ వినిపిస్తోంది. పైగా ఇప్పటికే విడుదలయిన ‘సలార్’ గ్లింప్స్ చూస్తుంటే అది మొత్తం ‘కేజీఎఫ్’ సెట్‌లాగా ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. ఒకవేళ ఇదే నిజమయితే.. ‘సలార్’.. ‘కేజీఎఫ్’కంటే పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Also Read: మరోస్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి, వరుస ఆఫర్లతో ఫుల్ జోష్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial