Champion Release Date: ఫీల్డ్‌లోకి 'ఛాంపియన్' ఎంట్రీ - రోషన్ న్యూ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Champion: యంగ్ హీరో రోషన్ న్యూ మూవీ 'ఛాంపియన్' త్వరలోనే వచ్చేస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫీల్డ్‌లోకి ఎంటర్ కాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Roshan Meka's Champion Release Date Locked: సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఛాంపియన్'. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
రిలీజ్ ఎప్పుడంటే?
క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'ది గేమ్ బిగిన్స్. ఛాంపియన్ ఎంటరింగ్ ది ఫీల్డ్' అంటూ క్యాప్షన్ ఇస్తూనే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్లైట్ నుంచి హీరో సూపర్ లుక్‌లో హీరో దిగుతున్నట్లుగా ఉన్న పోస్టర్ అదిరిపోయింది. మూవీని స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తుండగా స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైలెంట్‌గానే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఈ ఏడాది చివర్లో థియేటర్లలోకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
The game begins. ⚽️#Champion is entering the field. ⚡️
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) October 6, 2025
Experience the epic journey in cinemas worldwide this 𝐃𝐞𝐜𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟓𝐭𝐡. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @MickeyJMeyer @AshwiniDuttCh @SwapnaCinema @AnandiArtsOffl @ConceptFilms_ @zeestudiossouth… pic.twitter.com/lEfGLm5jSp
Also Read: యూరప్‌లో 'ది రాజా సాబ్' టీం - డార్లింగ్ ఫ్యాన్స్... జస్ట్ వెయిట్ అండ్ వాచ్
దాదాపు నాలుగేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు రోషన్. వరుసగా మూవీస్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ వచ్చేలా స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకుంటున్నారు. దాదాపు 50 కథలను రిజెక్ట్ చేసిన రోషన్ ఫైనల్‌గా ఈ స్టోరీని సెలక్ట్ చేశారు. పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఫుట్ బాల్ ప్రధానాంశంగా రాబోతోన్న ఈ మూవీలో రోషన్ న్యూ లుక్ ఆకట్టుకుంటోంది. మేకోవర్ అదిరిపోయిందని... ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
2016లో నిర్మలా కాన్వెంట్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఫస్ట్ మూవీలో తన నటనతో మెప్పించారు. ఇక 'పెళ్లిసందD' మూవీలోనూ నటించారు. ఆ తర్వాత స్క్రిప్ట్స్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 'ఛాంపియన్'తో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన 'వృషభ'లో చేస్తున్నారు. ఇందులో ఆయన మోహన్ లాల్ కుమారుడి పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్‌కు కేరాఫ్ అయిన శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. అయితే, ఇది కంప్లీట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్టును నిర్మించనుండగా... త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.





















