Bad Boy Karthik Teaser: స్మార్ట్ బాయ్ @ నాగశౌర్య - ఆసక్తికరంగా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్
Naga Shaurya Bad Boy Karthik: యంగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

Naga Shaurya's Bad Boy Karthik Movie Teaser Released: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'. రామ్ దేశిన దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో విధి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా... తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
టీజర్ అదుర్స్
ఈ మూవీలో నాగశౌర్య డిఫరెంట్‌గా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. 'నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పారు. కానీ స్మార్ట్ బాయ్‌లా ఉన్నావ్' అంటూ హీరో ఎలివేషన్ డైలాగ్ టీజర్‌లో అదిరిపోయింది. మాస్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఆకట్టుకుంటున్నాయి. స్టోరీలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. మూవీలో సీనియర్ హీరో సాయి కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తనదైన శైలిలో డైలాగ్‌తో మెప్పించారు. ఇక హీరోయిన్ పూర్ణ సీరియస్ లుక్‌లో కనిపించారు.
Also Read: బాలయ్య హిస్టారికల్ ఎపిక్ 'NBK111' - షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్... గెట్ రెడీ ఫర్ బిగ్ సర్‌ప్రైజెస్
మూవీలో నాగశౌర్య సరసన విధి యాదవ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీదేవి విజయ్ కుమార్, సీనియర్ నరేష్, మైమ్ గోపి, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. హ్యారీష్ జయరాజ్ ఈ మూవీతోనే తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా త్వరలోనే ట్రైలర్, సాంగ్స్, రిలీజ్ డేట్‌పై అప్డేట్స్ ఇవ్వనున్నారు.
నాగశౌర్య ఆఖరిగా 'రంగబలి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ మూవీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. 'దిక్కులు చూడకు రామయ్య', 'లక్ష్మి రావే మా ఇంటికి', 'ఛలో', 'అమ్మమ్మగారిల్లు', 'నర్తనశాల' మూవీస్ మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Action meets entertainment as #BadBoyKarthik storms in with a powerful purpose 💥💥#BadBoyKarthikTeaser Out Now ❤️🔥
— Vaishnavi Films (@vaishnavifilms_) October 6, 2025
▶️ https://t.co/UJN74dDxzT
In Cinemas Soon!
A @Jharrisjayaraj Musical🎶@IamNagashaurya @Viidhi28_ @vennelakishore @thondankani @RameshDesina @Sri4279 pic.twitter.com/ocXgUXyi38






















