Bubblegum Trailer: లిప్ లాక్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్‌తో రెచ్చిపోయిన సుమ కొడుకు - ‘బబుల్‌గమ్‘ ట్రైలర్ పెద్దలకు మాత్రమే!
Bubblegum Trailer: నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బబుల్‌గమ్‘. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
Roshan Kanakala's Bubblegum Trailer: నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆయన తాజాగా ‘బబుల్‌గమ్’ అనే సినిమా చేస్తున్నారు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. “ప్రేమ బబుల్ గమ్ లాంటిది. మొదట్ల తీయగుంటది. తర్వాత అంటుకుంటది” అంటూ సాగే డైలాగ్స్ తో టీజర్ ప్రేక్షకులలో బాగా వెళ్లిపోయింది. తాజాగా చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.
ఎమోషన్, రొమాన్స్ తో పిచ్చెక్కించిన రోషన్
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చిత్రబృందం ముందుగా ప్రకటించినట్లుగానే ఇవాళ ఉదయం 11:44 గంటలకు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రోషన్ యాక్షన్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్లు, బోల్డ్ డైలాగులతో పిచ్చెక్కించాడు. 2 నిమిషాల 42 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. తన తలరాతను, విధిరాతను తనకు నచ్చినట్టు మార్చుకోవాలని తపించే కుర్రాడి పాత్రలో రోషన్ కనిపించాడు. అదే సమయంతో తన లైఫ్ లోకి ప్రేమ, శత్రువులు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూపించారు. రోషన్ యాక్షన్, రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. తను చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల చక్కటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇక హీరోయిన్ మానస కూడా బాగా నటించింది. తన అందచందాలతో కుర్రకారును అలరించింది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఒదిగిపోయింది. మొత్తంగా ఈ ట్రైలర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెంచేస్తోంది.
డిసెంబర్ 29న ‘బబుల్‌గమ్‘ విడుదల
‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లాంటి సినిమాలో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు రవికాంత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రోషన్ కెరీర్‌కు అదిరిపోయే ఆరంభం ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాపై రాజీవ్, సుమ చాలా ఆశలు పెట్టుకున్నారు. కొడుకు తొలి సినిమా కావడంతో దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా రోషన్ ను మాంచి హీరోగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా ట్రైలర్ చూస్తే మాత్రం రోషన్ కు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళితో పాటు మరికొంత మంది నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram