Jordar Sujatha - Rocking Rakesh : రాకింగ్ రాకేష్ @ 2300 షోస్ - లండన్‌లో భార్యతో కలిసి బోనాల జాతర
బుల్లితెరపై ప్రేక్షకులను నవ్విస్తూ, తమ నటనతో అలరిస్తున్న 'రాకింగ్' రాకేష్, 'జోర్దార్' సుజాత దంపతులు లండన్ సిటీలో బోనాల జాతరలో పాల్గొన్నారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 'రాకింగ్' రాకేష్ (Rocking Rakesh) సుపరిచితులు. 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'బాబాయ్ హోటల్' తదితర కార్యక్రమాల ద్వారా కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమాల్లో కూడా చేస్తున్నారు. ఆయన భార్య 'జోర్దార్' సుజాత (Jordar Sujatha) కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. తొలుత టీవీ యాంకర్‌గా, ఆ తర్వాత 'బిగ్ బాస్' ఇంటిలో, ఇప్పుడు 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో ప్రజలను అలరిస్తున్నారు. ఇప్పుడీ దంపతులు లండన్ (London)లో ఉన్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
లండన్ గడ్డపై బోనాల జాతర
లండన్ సిటీలో వరంగల్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఫొరమ్ బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించింది. గత పదేళ్లుగా ఆ ఫోరమ్ అక్కడ బోనాలను ఉత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది మరింతగా ప్రత్యేకంగా నిర్వహించాలని తెలంగాణ మహిళ అయినటువంటి యాంకర్, యువ నటి జోర్దార్ సుజాతను ఆహ్వానించారు. ఆమెతో పాటు భర్త రాకింగ్ రాకేష్‌కు సైతం ప్రత్యేక ఆహ్వానం అందించారు. దాంతో భార్య భర్తలు ఇద్దరు అక్కడికి వెళ్లారు.
లండన్ షోతో 2300 షోలు పూర్తి చేశా! - రాకింగ్ రాకేష్
'జబర్దస్త్'తో పాటు ఇతర టీవీ కార్యక్రమాల్లో స్కిట్స్ చేసే రాకేష్... సినిమా, ఇతర వేడుకల్లో సైతం స్కిట్స్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లండన్‌లో చేసిన షోతో 2300 షోలను పూర్తి చేశానని 'రాకింగ్' రాకేష్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నాకు వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌తో మంచి అనుబంధం ఉంది. కరోనా సమయంలో, అంతకు ముందు మామూలు రోజుల్లోనూ ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి నా ద్వారా డబ్బు పంపి సహకారం అందించారు. చిన్నారుల విద్య, వైద్యానికి వాళ్ళు సహకరించారు. ఈసారి బోనాల వేడుకలో మేం భాగం కావాలని వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ కోరడంతో... గతంలో వారు చేసినా సేవలకు కృతజ్ఞతా భావంతో లండన్ షో చేశా. ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది'' అని చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రీధర్ నీల, ఫౌండర్ కిరణ్ పసునూరి, జనరల్ సెక్రటరీ రమణ, వైస్ ప్రెసిడెంట్ నాగ ప్రశాంతి, ప్రవీణ్ బిట్ల, కమల తదితరులకు రాకింగ్ రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ మార్టినెజ్‌తో ఫోటో, ఎవరీ మార్టినెజ్?
నేరెళ్ల వేణుమాధవ్ శిష్యుల తర్వాత 'రాకింగ్' రాజేశ్ మిమిక్రీ అంతగా పాపురల్ అయ్యారు. ఇటీవల అమెరికా, న్యూజెర్సీలో నిర్వహించిన నాట్స్ కార్యక్రమంలో ఆయన స్కిట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అక్కడి నుంచి 'రాకింగ్' రాకేశ్, 'జోర్దార్' సుజాత లండన్ నగరంలో జరిగిన బోనాల ఉత్సవంలో పాల్గొనడానికి వెళ్లారు. తమ స్కిట్లు, మిమిక్రీ కార్యక్రమాలతో ప్రవాస భారతీయులను అలరించారు.
Also Read : సుజీత్ స్పీడును ఆపేదెవరు? - హైదరాబాద్‌లో పవన్ 'ఓజీ'!
వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ నీల మాట్లాడుతూ ''తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలను ఎన్నో ఏళ్లగా లండన్‌లో నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపడానికి 'రాకింగ్ రాకేశ్', 'జోర్దార్' సుజాత దంపతులు ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది'' అని చెప్పారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial