Argentina Goalkeeper Martinez : బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్‌తో ఫోటో
ఇండియాలో వినోదం అంటే సినిమాలు, క్రికెట్. అయితే... బాలకృష్ణ అభిమాని ఒకరికి ఫుట్ బాల్ అంటే ఇష్టం. అర్జెంటీనా స్టార్ గోల్ కీపర్ మార్టినెజ్‌ను కలవడం కోసం అతను కలకత్తా వెళ్ళాడు.
ఇండియాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి రెండు అంటే రెండు మాత్రమే! ఒకటి... సినిమా! రెండోది... క్రికెట్! అందులోనూ తెలుగు ప్రజలకు సినిమాలు అంటే ఎక్కువ అభిమానం ఉంటుంది. సినిమాలతో పాటు కార్తికేయ పాడి (karthikeya Padi) అనే యువకుడికి ఫుట్ బాల్ అంటే ఇష్టం. తన అభిమాన ఫుట్ బాల్ క్రీడాకారుడు కలకత్తా వచ్చాడని తెలుసుకుని, అతడిని కలవడం కోసం వెళ్ళాడు. అసలు వివరాల్లోకి వెళితే...
బాలకృష్ణకు కార్తికేయ వీరాభిమని!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు కార్తికేయ పాడి వీరాభిమాని. డాక్టర్ బి. వి. రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నర్సాపూర్ క్యాంపస్)లో ఇప్పుడు బీటెక్ మొదటి సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. స్వతహాగా అతడు ఫుట్ బాల్ ప్లేయర్ కూడా! సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (లండన్)లో ఓకల్ వెస్ట్రన్, పియానో 5వ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించాడు.
బాలకృష్ణ సెంచరీ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో కార్తికేయకు నటించే అవకాశం వచ్చింది. అయితే... పరీక్షలు సమయంలో చిత్రీకరణ కావడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు.
బాలకృష్ణ తర్వాత మార్టినెజ్ అంటే అభిమానం!
బాలకృష్ణ తర్వాత ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు, అర్జెంటీనా స్టార్, గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ (Argentina Goalkeeper Emiliano Martinez) అంటే కార్తికేయ పాడికి చాలా అభిమానం. బాలకృష్ణను గతంలో కలిసిన కార్తికేయ... చాలా రోజులుగా ఎమిలియానోని కలవాలని ప్రయత్నిస్తున్నాడు. అది అతడి చిరకాల కోరిక. ఇటీవల ఎమిలియానో మార్టినెజ్ కలకత్తా వచ్చాడని తెలుసుకున్న కార్తికేయ... అక్కడికి వెళ్లి మరీ కలిశాడు.
Also Read : పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్ - ఈసారి హీరో ఎవరంటే?
డిగో మారడోనా సారధ్యంలో అర్జెంటీనా 1986లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత చాలా సంవత్సరాలకు... మళ్ళీ 2022లో కతార్ లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో విజేతగా నిలిచింది. తన విజయ పతాకాన్ని రెపరెప లాడించింది. ఈ ఘనత వెనుక గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ పాత్ర కీలకమైంది. ఫిఫా 2022లో అర్జెంటీనా ఫైనల్ చేరుకుంది. ఫ్రాన్స్ తో తలపడింది. అయితే... ఆ మ్యాచ్ 3-3తో సమం కావడంతో విజేతను నిశ్చయించడానికి పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఫ్రాన్స్ పెనాల్టీ కిక్‌ను గోల్ కీపర్ మార్టినెజ్ నిలువరించడంతో అర్జెంటీనా 4-2తో విజేతగా నిలిచింది. అంతకు ముందు 2021 కోపా కప్ సెమీ ఫైనల్ లో కూడా మార్టినెజ్ మూడు పెనాల్టీలు నిలువరించాడు. అలా అర్జెంటీనా జట్టు ఫైనల్ చేరడంతో పాటు ఆ సంవత్సరం విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
కలకత్తా వచ్చిన మార్టినెజ్!
ఈ నెల 4, 5 తేదీల్లో మార్టినెజ్ ఇండియా సందర్శించాడు. కలకత్తాలోని మోహన్ బగాన్ క్లబ్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. మార్టినెజ్ భారత పర్యటన గురించి తెలుసుకున్న కార్తికేయ పాడి కలకత్తా వెళ్లారు. 2022 ప్రపంచ కప్ రిప్లికాతో ఫోటో దిగాడు. అర్జెంటీనా జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా మార్టినెజ్ పర్యటన గురించి తెలుసుకుని... కార్తికేయ కలకత్తా వెళ్లి రావడం విశేషం. సంగీతంలోనూ ప్రావీణ్యం ఉన్న ఈ తెలుగు యువకుడు... ఎప్పటికి అయినా సరే బాలకృష్ణకు గాత్ర దానం చేయాలన్నది తన కోరిక చెబుతున్నాడు. కార్తికేయ తమ్ముడు శ్రీకృష్ణ దేవరాయ సైతం బాలకృష్ణకు వీరాభిమాని.
Also Read : కుమార్తెతో సురేఖా వాణి డ్యాన్స్ - డ్రగ్స్ కేసు నుంచి నార్మల్ లైఫ్‌కు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial