Rishab Shetty: ఆమె నడుము గిచ్చితే తప్పులేదా? రిషబ్ శెట్టిపై నెటిజన్స్ ఫైర్, బాలీవుడ్‌పై చేసిన ఆ కామెంట్స్‌పై ట్రోలింగ్
Rishab Shetty: నేషనల్ అవార్డు విన్నర్, 'కాంతార' సినిమా ఫేమ్ రిషబ్ శెట్టి బాలీవుడ్ పై విమర్శలు చేశారు. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుండగా నెటిజన్లు రిషబ్ శెట్టిపై విరుచుకుపడుతున్నారు.
![Rishab Shetty: ఆమె నడుము గిచ్చితే తప్పులేదా? రిషబ్ శెట్టిపై నెటిజన్స్ ఫైర్, బాలీవుడ్‌పై చేసిన ఆ కామెంట్స్‌పై ట్రోలింగ్ Rishab Shetty slams Bollywood, says 'It shows India in a bad light,' netizens troll back 'You pinched a woman's waist in Kantara without her consent' Rishab Shetty: ఆమె నడుము గిచ్చితే తప్పులేదా? రిషబ్ శెట్టిపై నెటిజన్స్ ఫైర్, బాలీవుడ్‌పై చేసిన ఆ కామెంట్స్‌పై ట్రోలింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/21/630926522705c8bcab037c459c4a60771724232174221932_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rishab Shetty Slams Bollywood It shows India in a Bad light: 'కాంతార' సినిమాతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఇటీవల ఆ సినిమాకి ఆయన అవార్డు కూడా అందుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయన చేసిన కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. బాలీవుడ్ పై ఆయన చేసిన కామెంట్స్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. "నువ్వు చేసింది ఏమైనా కరెక్టా?" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అవార్డు గెలిచిన సందర్భంగా ఒక ఛానెల్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఆ కామెంట్స్ చేశారు. అసలు రిషబ్ శెట్టి ఏమన్నారు? నెటిజన్లు ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు?
బాలీవుడ్ మన దేశాన్ని తప్పుగా చూపిస్తుంది..
కేంద్రం ఇటీవల ప్రకటించిన 70వ నేషనల్ అవార్డ్స్ లో 'కాంతార' సినిమాకి అవార్డు వచ్చింది. రిషబ్ శెట్టి నటనకు ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. బాలీవుడ్ గురించి ప్రస్తావన రాగా.. తీవ్ర కామెంట్స్ చేశారు రిషబ్ శెట్టి. "ఇండియన్ సినిమాలు, ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు ఇండియాను తప్పుగా చూపిస్తున్నాయి. కానీ ఆర్ట్ సినిమాలకి ఎర్రతివాచీ పరుస్తున్నారు. ఎందుకు మనలోని మంచి చూపించడం లేదు. అందుకే నేను ఇలాంటి సినిమాలు తీసి మంచి చూపించాలని ప్రయత్నిస్తున్నా. నా దేశం, నా రాష్ట్రం, నా భాష నాకు గర్వకారణం" అని చెప్పారు రిషబ్ శెట్టి. దీంతో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆటాడుకుంటున్ననెటిజన్లు..
రిషబ్ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. కాంతార సినిమాలో హీరోయిన్ నడుము గిల్లిన సీన్ ని షేర్ చేస్తూ.. నువ్వు చేసింది ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆమె నడుము గిచ్చితే తప్పులేదా? అని కామెంట్లు పెడుతున్నారు. ఏం మంచి చూపిస్తున్నావు? పర్మిషన్ లేకుండా ఆడదాని నడుము గిల్లడం మంచి చూపించడమా? ఆర్ట్ అంటే అదేనా అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా రిషబ్ శెట్టిని తప్పుపడుతున్నారు.
కాంతార చాప్టర్ - 1..
'కాంతార' సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. కర్నాటకలోని ఒక సంప్రదాయ నృత్యం గురించి ఈ సినిమా తీశారు. దాంట్లో రిషబ్ శెట్టి యాక్టింగ్ కి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లుకు జనాలు ఫిదా అయ్యారు. కాగా.. ఇటీవల ఆయన యాక్టింగ్ కి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఇక ఇప్పుడు కాంతారకి కొనసాగింపు 'కాంతార చాప్టర్ - 1' రానుంది. ఆ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు రిషబ్. వచ్చే ఏడాది ఆ సినిమా రిలీజ్ కానుంది. అయితే, ఈసినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Also Read: ఆ హీరోను పొట్టోడా అంటే కోపం వచ్చేది, వాళ్లకు నాకు తిక్క ఉందిలాంటి డైలాగులే నచ్చుతాయి: హరీష్ శంకర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)