అన్వేషించండి

Rishab Shetty: ఓటీటీలపై మండిపడ్డ రిషబ్ శెట్టి - అలా చేయడం బాగోలేదంటూ ఫైర్

Rishab Shetty, OTTs : తాజాగా ఐఎఫ్ఎఫ్ఐలో పాల్గొన్న యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి.. ఓటీటీల వల్ల కన్నడ సినిమాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ఓపెన్‌గా బయటపెట్టారు.

Rishab Shetty, Kannada Movies: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమాల హవానే ఎక్కువగా ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు సౌత్‌లో తెలుగు, తమిళ ఇండస్ట్రీల డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ మెల్లగా పరిస్థితులు మారిపోయాయి. మలయాళ, కన్నడ ఇండస్ట్రీలు కూడా బాక్సాఫీస్ రేసులోకి దూసుకొచ్చాయి. ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీవైపు అందరూ తిరిగి చూసేలా చేశారు అక్కడి మేకర్స్. కానీ ఒకప్పుడు శాండిల్‌వుడ్ ఎదుర్కున్న కష్టాల గురించి యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి నోరువిప్పారు. ఆ కష్టాలు ఇప్పటికీ ఉన్నాయని బయటపెట్టారు. కన్నడ చిత్రాలను కొనడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు.

 కన్నడ సినిమాలను యాక్సెప్ట్ చేయట్లేదు..
ఇటీవల జరిగిన ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి పాల్గొన్నారు. అక్కడే కన్నడ సినీ పరిశ్రమ పరిస్థితి గురించి బయటపెట్టారు. ఒకప్పుడు ఎన్‌ఎఫ్‌డీసీ ఫిల్మ్ బజార్‌లాంటి కార్యక్రమాల్లో పాల్గొని కన్నడ సినీ పరిశ్రమ డబ్బులు సంపాదించుకునేదని గుర్తుచేసుకున్నారు. కోవిడ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. ‘‘కోవిడ్ మహమ్మారి తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల మార్కెట్స్ అనేవి కుప్పకూలిపోయాయి. ఓటీటీలు అనేవి కన్నడ సినిమాలను యాక్సెప్ట్ చేయడం మానేశాయి ఎందుకంటే అప్పట్లో ఒక కమర్షియల్ కన్నడ చిత్రం ఫ్లాప్ అయ్యింది’’ అని ఓటీటీల్లో కన్నడ సినిమా పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు రిషబ్.

ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం..
‘‘ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అన్నీ కన్నడ సినిమాలను విడుదల చేసే వీలు లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇదేమీ బాలేదు. ఒక సినిమా వల్ల సబ్‌స్క్రైబర్సే లేరు అని చెప్పడం కరెక్ట్ కాదు. కన్నడ సినిమాలను యాక్సెప్ట్ చేయడానికి టైమ్ తీసుకుంటామని ఓటీటీలు అంటున్నాయి. వారు ఓకే అనే రోజు కోసం ఎదురుచూస్తున్నాం’’ అని ఓటీటీల ద్వారా కన్నడ సినిమాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను బయటపెట్టారు రిషబ్ శెట్టి. ఇక రిషబ్‌లాంటి స్టార్ ముందుకు వచ్చి మాట్లాడడంతో నిజంగానే ఓటీటీలు కన్నడ సినిమాలను ఇబ్బంది పెడుతున్నాయనే విషయం చాలామంది ఇతర భాషా ప్రేక్షకులకు అర్థమయ్యింది.

ఐఎఫ్ఎఫ్ఐలో ‘కాంతార’..
ఇక ‘కాంతార’లాంటి చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ల లిస్ట్‌లో రిషబ్ శెట్టి పేరు కూడా యాడ్ అయ్యింది. ఈ సినిమాలో రిషబ్ నటించడం మాత్రమే కాకుండా తనే దీనికి కథను అందించడంతో పాటు డైరెక్ట్ కూడా చేశాడు.  ఈ పీరియాడిక్ సినిమా తాజాగా ఐఎఫ్ఎఫ్ఐ 2023లో ప్రసారమయ్యింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కించుకున్న ‘కాంతార’కు ఐఎఫ్ఎఫ్ఐలో ఫీచర్ అవ్వడం మరో రికార్డ్‌గా మారింది. ఇక ఆ మూవీకి ప్రీక్వెల్ అయిన ‘కాంతార 1’ పనులు కూడా ప్రారంభమయ్యాయి. తాజాగా ఈ ప్రీక్వెల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. కాంతార 2 కంటే ‘కాంతార చాప్టర్1’లో రిషబ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండడంతో ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పేంచేసుకుంటున్నారు. ‘కాంతార 1’ 2024లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రీక్వెల్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

Also Read: అర్జున్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ శివాజీ రివర్స్ స్ట్రాటజీ - ‘బిగ్ బాస్’పై అలిగిన SPY

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Embed widget