అన్వేషించండి

Bigg Boss 7 Telugu: అర్జున్‌పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ శివాజీ రివర్స్ స్ట్రాటజీ - ‘బిగ్ బాస్’పై అలిగిన SPY

Bigg Boss Telugu 7: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ, అర్జున్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎవరికి వారు తమ స్ట్రాటజీనే గొప్ప అనుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

Bigg Boss Telugu 7: నామినేషన్స్ ముగిసిపోయిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ అంతా దాని గురించే మాట్లాడుకునే అలవాటు ఇంకా మార్చుకోలేదు. నామినేషన్స్‌లో ఉన్నందుకు.. తనను నమ్మినవాళ్లే మోసం చేశారంటూ పల్లవి ప్రశాంత్.. చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక శివాజీ కూడా అర్జున్ విషయంలో కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు. నామినేషన్స్ రోజు మాత్రమే కాదు.. ఆ తర్వాత రోజు కూడా అర్జున్.. తనను నామినేట్ చేసినదాని గురించే ప్రశాంత్‌తో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అసలు అర్జున్ వైపుకు వెళ్లకుండా తనకు దూరంగా ఉంటున్నాడు శివాజీ. గేమ్స్ విషయంలో కూడా తనకు ఇకపై సపోర్ట్ చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. 

100 శాతం పిచ్చి స్ట్రాటజీ..
‘‘నేను మొన్నే వెళ్లిపోవాల్సింది. మెంటల్ టార్చర్‌లాగా ఉంది. వాడేంటి? వాడితో నాకేం సంబంధం? ప్రతీవారం కావాలని గొడవపెట్టుకుంటున్నాడు. వాడికేం ప్రయోజం ఉందో దేవుడికే తెలియాలి. ఇంత దారుణంగా కమర్షియల్ ఉంటారా? ఆ అబ్బాయి అన్ని అబద్దాలే చెప్తున్నాడు. వాడిని నేను ఆపుతున్నానంట. నేనేం ఆపాను? ఆపితే 12 వారాలు ఉంటాడా?’’ అని గౌతమ్ గురించి ప్రశాంత్‌తో చెప్పుకొచ్చాడు శివాజీ. ఆ తర్వాత అర్జున్‌పై కూడా ఆరోపణలు చేశాడు. ‘‘అర్జున్ అతితెలివి ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రేమగా దగ్గరగా ఉంటే పొడుస్తారు. ఏంటో జనం. నన్ను పంపించేయండి. అర్జున్‌ను చూసి మంచోడు మనిషి అనుకున్నాను. ఇంత వంకరగా ఆలోచిస్తాడని అనుకోలేదు 100 శాతం అది పిచ్చి స్ట్రాటజీ. శోభా చెప్పింది నచ్చలేదు అన్నప్పుడు తనకు చేసుకోవచ్చు కదా నామినేషన్’’ అని అర్జున్ గురించి మాట్లాడాడు శివాజీ. రోజు మొత్తంలో అర్జున్ ప్రస్తావన చాలాసార్లు తీసుకొచ్చాడు. జీవితంలో ఎప్పుడైనా ఇంకొకరి కోసం స్టాండ్ తీసుకోవాలంటే భయమేస్తుందని అన్నాడు. ఇదంతా జనాలు చూస్తాడనే శివాజీ.. తనను నామినేట్ చేసిన గౌతమ్, అర్జున్‌ల గురించి ఎక్కువ మాట్లాడుతూ బిగ్ బాస్‌కు ఫూటేజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మొహం కూడా చూడడం లేదు..
శోభా, అమర్‌దీప్, ప్రియాంక కలిసి కూడా తాజాగా నామినేషన్స్ గురించే చర్చించుకున్నారు. ఇన్నివారాలు అసలు నామినేషన్స్ జరగనట్టు, కొత్తగా జరుగుతున్నట్టు ప్రవర్తిస్తున్నారు అని శోభా చెప్పడం మొదలుపెట్టింది. నామినేషన్స్ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ తనతో ఎలా ప్రవర్తించాడో వారితో చెప్పాడు అమర్. నమ్మకద్రోహం అనే పదాన్ని కావాలని ప్రేక్షకులు చూడాలని ఉపయోగించాలని అన్నాడు. మామూలుగా ప్రశాంత్.. రివర్స్ నామినేషన్స్ వేస్తాడని, కానీ అమర్ విషయంలో అలా వేయడం జరగలేదు కాబట్టి ఫీల్ అవుతున్నాడని శోభా తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. యావర్, ప్రశాంత్.. తనతో, ప్రియాంతో మాట్లాడడం లేదని, పక్కకు తప్పుకొని వెళ్లిపోతారని చెప్పింది.

బిగ్ బాస్‌పై ప్రశాంత్ అలక..
హౌజ్‌లో సరదాగా జరిగే విషయాలను కూడా స్పై బ్యాచ్ సీరియస్‌గా తీసుకుంటోంది. హౌజ్ అంతా ఒకవైపు సరదాగా ఉన్నా స్పై బ్యాచ్ మాత్రం సెపరేటుగా ఉంటూ ఎవరి ఎంజాయ్‌మెంట్‌లో పాల్గొనడానికి ఇష్టపడలేదు. ఇక నవంబర్ 28న ప్రసారమయిన ఎపిసోడ్‌లో అమర్.. చపాతీ పిండి కలుపుతుంటే.. బాగా కలుపుతున్నావని, చపాతీలు చేసిన తర్వాత తనకు కూడా పంపించమని బిగ్ బాస్ అన్నారు. దీంతో ప్రశాంత్.. బిగ్ బాస్‌పై అలిగాడు. నేను ఎన్నిసార్లు పిండి కలిపినా.. ఒకసారి కూడా అనలేదని ఫీల్ అయ్యాడు. గౌతమ్ కూడా తాను రెండు గంటలు నిలబడి అందరికోసం కష్టపడి చపాతీలు చేసినప్పుడు తనను ఎప్పుడూ బిగ్ బాస్ ప్రశంసించలేదని అన్నాడు. ఆ తర్వాత శివాజీ వచ్చి వడలు చేసినప్పుడు, ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు కూడా బిగ్ బాస్ ఇలా అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదని గుర్తుచేసుకున్నాడు. దీంతో హౌజ్ అంతా సరదాగా ఉన్నా.. స్పై బ్యాచ్ మాత్రం వారితో కలవకూడదని డిసైడ్ అయినట్టు అనిపిస్తోంది.

Also Read: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget