Renu Desai : పవన్ కళ్యాణ్ కుమారుడిగా జన్మించడం అకిరా తప్పా? నెటిజన్ ప్రశ్నకు రేణూ దేశాయ్ రిప్లై
Pawan Kalyan Son Akira Nandan Viral Pic : హీరోలు, దర్శక నిర్మాతల కుమారులుగా జన్మించడం పిల్లల తప్పు కాదని నటి రేణూ దేశాయ్ తెలిపారు. హీరోగా అకిరా నందన్ ఎంట్రీపై నెటిజన్ వేసిన ప్రశ్నకు బదులిచ్చారు.
ఒకానొక సమయంలో హిందీ చిత్రసీమను నేపోటిజం చర్చ ఇబ్బంది పెట్టింది. మరీ ముఖ్యంగా రణబీర్ కపూర్, ఆలియా భట్, అనన్యా పాండే తదితర తారలు చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. స్టార్ కిడ్స్, చిత్రసీమతో సంబంధం ఉన్న యువతకు సులభంగా అవకాశాలు వస్తున్నాయని విమర్శలు వచ్చాయి. అయితే, వాళ్ళందరూ సినిమాల్లోకి వచ్చిన తర్వాత వారి గురించి చర్చ నడిచింది. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ (Akira Nandan) సినిమాల్లోకి రాలేదు. కానీ, అతను వార్తల్లో నిలిచారు. అందుకు కారణం ఏమిటి? పూర్తి వివరాలు ఏమిటి? అనేది చూస్తే...
రాఘవేంద్రుడి ఫోటోతో చర్చ షురూ
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావుతో అకిరా నందన్ దిగిన ఫోటో రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కుమారుడిని లండన్ పంపించారని, అక్కడ ఓ ఫిల్మ్ స్కూల్‌లో నటనలో శిక్షణ ఇప్పిస్తున్నారని చాలా మంది తమకు తోచిన విధంగా రకరకాల కథనాలు ప్రచారంలోకి తెచ్చారు. అసలు విషయం ఏమిటంటే... నార్వేలో జరిగిన 'బాహుబలి' కాన్సర్ట్ కోసం తల్లి రేణూ దేశాయ్ (Renu Desai)తో కలిసి అకిరా నందన్ కూడా విదేశాలు వెళ్లారు. అక్కడ రాఘవేంద్ర రావుతో ఫోటో దిగారు. అయితే... ఓ నెటిజన్ అకిరా నందన్ ఫిల్మ్ స్కూల్‌కు వెళ్లారని భావించి రేణూ దేశాయ్ ముందు ఓ పెద్ద ప్రశ్న ఉంచారు.
ఇది ఎంతవరకు సమంజసం?
''ఫిల్మ్ స్కూల్స్ కు వెళ్లి వందల మంది యాక్టింగ్ కోర్సులు చేస్తారు. అయితే, ఆ స్ట్రగుల్స్ పడే వాళ్ళకు గుర్తింపు లభించదు. అదే సూపర్ స్టార్ కుమారుడికి అయితే తాను ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అతని తెరంగేట్రానికి మంచి కథ, సాంకేతిక బృందం లభిస్తుంది. ఇన్స్టంట్ కాఫీ చేసినంత ఈజీగా లాంచ్ కావచ్చు. ఇది సమంజసమేనా?'' అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
అంబానీ ఎవరికో కంపెనీ రాసివ్వరు కదా!
నెటిజన్ ప్రశ్నకు రేణూ దేశాయ్ సవివరంగా రిప్లై ఇచ్చారు. స్టార్ కిడ్స్ లగ్జరీతో పాటు వాళ్ళ ఇబ్బందులను కూడా ఆమె ప్రస్తావించారు. ''ఉదాహరణకు... తన కుమారుడు లేదా కుమార్తెకు కంపెనీ ఎప్పుడు హ్యాండోవర్ చేయాలనే నిర్ణయం అంబానీ తీసుకుంటారు. ఎవరో బయట వ్యక్తికి ఆయన తన కంపెనీ రాసి ఇవ్వరు కదా! నిజమే... ఫిల్మ్ ఇండస్ట్రీలో జన్మించిన పిల్లలకు ఈజీగా లాంచ్ అవుతారు. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే... దారుణంగా విమర్శల పాలు అవుతారు. ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులతో కంపేర్ చేస్తూ తిడతారు. అదే బయట వ్యక్తి ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి... వాళ్ళను ఎవరూ గుర్తించరు. ఒకవేళ సక్సెస్ అయితే... వాళ్ళ ప్రతిభ, హార్డ్ వర్క్ ఆధారంగా రజనీకాంత్, మాధురీ దీక్షిత్ అవుతారు. అందువల్ల, మీ పని మీద ఫోకస్ చేయండి. మీ ప్రతిభ, హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకోండి. సరిగ్గా పని చేస్తే విజయాలు వస్తాయి. నెగిటివిటీ వల్ల ప్రయోజనం ఉండదు'' అని రేణూ దేశాయ్ సమాధానం ఇచ్చారు.
Also Read : శంకర్ ఎప్పుడు చెబితే అప్పుడు - చేతులు ఎత్తేసిన 'దిల్' రాజు
View this post on Instagram
హీరోలు, దర్శకులు, నిర్మాతల పిల్లలుగా జన్మించడం ఆ చిన్నారుల తప్పు కాదని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ కుమారుడిగా జన్మించడం అకిరా నందన్ తప్పు కాదని ఆమె స్పష్టం చేసినట్లు అయ్యింది. హీరోల వారసులకు తొలి అవకాశం సులభంగా వచ్చినప్పటికీ... తల్లిదండ్రులు, ఫ్యామిలీ పేరు నిలబెట్టడం కోసం వాళ్ళు రెండింతలు కష్టపడాలని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ప్రతిభావంతులను స్టార్స్ కాకుండా ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీ బయట వ్యక్తులకు ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి అకిరా నందన్ హీరో కావాలని అనుకోవడం లేదని, భవిష్యత్ గురించి తాను ఇప్పుడు ఊహించి చెప్పలేనని రేణూ దేశాయ్ తెలిపారు.
Also Read : ప్రతి పండక్కి, ప్రతి నెలలో శ్రీ లీల సినిమా... వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial