Maremma: 'మారెమ్మ'లో మాస్ మహారాజ్ ఫ్యామిలీ హీరో... మాధవ్ భూపతిరాజు పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ చూశారా?
Maadhav Bhupathiraju Movie: రవితేజ సోదరుడి (రఘు) కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'మారెమ్మ'. ఈ సినిమా పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కుటుంబం నుంచి మరో యువకుడు తెలుగు తెరపైకి వస్తున్నారు. 'రాజా ది గ్రేట్'లో హీరో చిన్నప్పటి ఎపిసోడ్‌లో కనిపించింది ఎవరో కాదు... రవితేజ కుమారుడు మహాధన్. ఇప్పుడు మాస్ మహారాజ్ సోదరుడు, నటుడు రఘు కుమారుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అయ్యారు. హీరోగా తెరపైకి వస్తున్నారు. మాధవ్ భూపతిరాజు కథానాయకుడిగా రూపొందుతున్న రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
మారెమ్మ... మాస్ ఫస్ట్ లుక్!
Maadhav Bhupathiraju In Maremma Movie: 'మారెమ్మ'తో మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మోక్ష ఆర్ట్స్ పతాకం మీద మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఆ సంస్థలో తొలి చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

'మారెమ్మ'లో మాధవ్ భూపతిరాజు ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. చెక్డ్ షర్ట్, లుంగీ, మెడలో టవల్‌తో, వెనుక గేద... హీరో లుక్ పక్కా పల్లెటూరి యువకుడిలా ఉంది. గుబురు గెడ్డం, పొడవాటి ఒత్తైన జుట్టు... ఈ క్యారెక్టర్ కోసం మాధవ్ మేకోవర్ అయినట్టు అర్థం అవుతోంది. ఆయన క్యారెక్టర్ ఫెరోషియస్‌గా ఉంటుందట. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా మంచాల నాగరాజ్ పవర్ ఫుల్‌గా రాశారని నిర్మాత తెలిపారు.
Maremma Movie Cast And Crew: మాధవ్ భూపతిరాజు సరసన దీపా బాలు కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపా లక్ష్మి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఉమేష్ విలాసాగరం, క్రియేటివ్ నిర్మాత: కుశాల్ రెడ్డి కందాలా, ఛాయాగ్రహణం: ప్రశాంత్ అంకిరెడ్డి,కూర్పు: దేవ్ రాథోడ్, కళా దర్శకత్వం: రాజ్ కుమార్ మురుగేషన్, పోరాటాలు: మాడిగొండ నటరాజ్, నృత్య దర్శకత్వం: సాగ్గీ సాగర్,సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ - కమల్ ఎస్లావత్, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాణ సంస్థ: మోక్ష ఆర్ట్స్, నిర్మాత: మయూర్ రెడ్డి బండారు, రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్.





















