Mr Bachchan: పొరపాటు దిద్దుకున్న 'మిస్టర్ బచ్చన్' టీం - సినిమా నిడివి తగ్గింపు...
Mr Bachchan Movie: ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో పలు సీన్లపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ టీం కీలక నిర్ణయం తీసుకుంది.
Mr Bachchan Movie Duration trimmed: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషనల్ తెరకెక్కిన చిత్రం 'మిస్టర్ బచ్చన్'. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అనగానే ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, పాటలు, టీజర్, ట్రైలర్‌తో మూవీ మరింత బజ్ క్రియేట్. మూవీ రిలీజ్ ముందుకు వరకు మాస్ మహారాజా ఎనర్జీని ఎలా వాడాలో బాగా తెలిసిన హరీష్ శంకర్ ఫ్యాన్స్ ఏమాత్రం డిసస్పాయింట్ చేయడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులంతా. అలా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమాకు పోటీగా పూరీ-రామ్ పోతినేనిల డబుల్ ఇస్మార్ట్ కూడా అదే రోజు విడుదలైంది. దీంతో మిస్టర్ బచ్చన్ కాన్పిడెన్స్‌తో ప్రీమియర్ షోను ముందు రోజే సాయంత్రం వేసింది. దీంతో మూవీ టాక్ బయటకు వచ్చేసింది. ప్రీమియర్స్‌తోనే డివైడ్ తెచ్చుకున్న మిస్టర్ బచ్చన్‌లో అనసరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి.. మాస్ మహరాజా రేంజ్‌లో సినిమా లేదంటూ ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 10 నిమిషాల స్టోరీతోనే సినిమా అంతా నడిపించాడని, హరీష్ శంకర్ రవితేజ టైంని వేస్ట్ చేశాడంటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆయనపై మండిపడ్డారు. ఆయన మంచి టాలంటెడ్ డైరెక్టర్.. డైలాగ్స్, స్క్రిప్ట్ పవర్పుల్‌గా రాయగలరు, కానీ ఇందులో ఆయన మార్క్ కనిపించడం లేదు.. సినిమాలో ల్యాగ్ ఎక్కువైందంటూ విమర్శించారు.
Taking in all the criticism and feedback, #MrBachchan is now trimmed by 13 minutes to make it even more racy and engaging.
— People Media Factory (@peoplemediafcy) August 16, 2024
Do not miss the 𝗠𝗔𝗦𝗦 𝗠𝗔𝗛𝗔 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 in theatres near you ❤️🔥
Book your tickets now!
🎟️ https://t.co/fBC3B1CnCW#MassReunion
Mass… pic.twitter.com/qAw6K7xQ5V
దీంతో మిస్టర్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో ఎక్కువగా మూవీ లెన్త్‌పై, అనసవరమై సీన్స్ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. ఇక వాటిని చూసిన మూవీ టీం తమ తప్పును సరిదిద్దుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రాన్ని 13 నిమిషాల నిడివి తగ్గించినట్టు పేర్కొంది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటన ఇచ్చింది. "సోషల్ మీడియాలో వస్తన్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారం సినిమా నిడివిని 13 నిమిషాలకు తగ్గించాం. దీంతో ఇప్పుడు ఈ మూవీ మరింత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటుందని నమ్ముతున్నాం" అంటూ పోస్ట్ షేర్ చేసింది. దారుణమైన ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో సినిమా రన్ టైమ్ తగ్గించడం వల్ల కథనం బలపడుతుందని, క్లైమాక్స్‌కు మరింత బలం చేకూరుతుందని మూవీ టీం అభిప్రాయపడుతుంది.
ఈనేపథ్యంలో ఎక్కువగా ట్రోల్స్ గురైన సీన్లు, అనవసమైన సన్నివేశాలను కట్ చేసి 13 నిమిషాలు తగ్గించారట. ఇక ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే పలు థియేటర్లో ప్రదర్శించినట్టు కూడా తెలుస్తోంది. లాంగ్ వీకెండ్, రాఖీ పండగ ఉన్న నేపథ్యంలో మిస్టర్ నిడివి తగ్గించడం మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి!. ఆగస్టు 15న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ కూడా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కానీ మిస్టర్ బచ్చన్‌తో పోల్చితే డబుల్ ఇస్మార్ట్ బేటర్ అంటున్నారు. తమిళ డబ్బింగ్ చిత్రం తంగలాన్ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నేనితిన్ నటించని ఆయ్ మూవీకి మంచి టాక్ తెచ్చుకుంది.
Also Read: పవన్‌కి రామ్ చరణ్ బిగ్ గిఫ్ట్, పిఠాపురంలో బాబాయ్ ఎన్నికల హామీని నెరవేర్చుతున్న అబ్బాయ్